నవరత్నాలతోనే ప్రజలకు మేలు

గుర్ల: నవరత్నాలతోనే ప్రజలకు మేలు చేకురుతుందని వైయస్సార్‌ సీపీ జిల్లా పార్టీ సమన్వయ కర్త మజ్జి శ్రీనువాసురావు అన్నారు. మండలంలోని చింతలపేట గ్రామంలో వైయస్‌ఆర్‌ కుటుంబంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి నవరత్నాలు గురుంచి వివరించారు. తెలుగు దేశం ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలు నేరవేర్చకుండా మీనమేషాలు లెక్కిస్తుందని ప్రజలకు గుర్తు తెచ్చారు. రాజన్న రాజ్యం మరల రావాలంటే జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి రావాలన్నారు. నవరత్నాలు పత్రాలును మహిళలుకు ఇచ్చి వాటి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నాఫెడ్‌ డైరెక్టర్‌ కె.వి సూర్యనారాయణరాజు, మండల వైసీపీ నాయకులు పోట్నూరు సన్యాసినాయుడు, శీర అప్పలనాయుడు ,గ్రామ స్ధాయి నాయకులు పాల్గొన్నారు.
......................................................
జగనన్న రాకతోనే పేదలకు సంక్షేమ ఫలాలు
జియ్యమ్మవలసః వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాజన్న రాజ్యం వస్తుందని వైయస్సార్‌ సీపీ మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పట్లాసింగి చంటి తెలిపారు. బుధవారం శిఖబడిలో ప్రతి ఇంటికి వెళ్లి నవరత్నాల గురించి వివరించారు. వైయస్సార్‌ కుటుంబంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుదామని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు సెల్‌ నెంబరు 91210 91210 కు మిస్డ్‌కాల్‌ చేయడంతో వైయస్సార్‌ కుటుంబంలో సభ్యులుగా చేరవచ్చని తెలిపారు.
’ పిప్పలబద్రలో...
మండలంలోని పిప్పలబద్ర గ్రామంలో మండల కన్వినర్‌ మూడడ్ల గౌరీశంకరరావు ఆధ్వర్యంలో మంగళవారం ఇంటింటికి తిరిగి నవరత్నాల గురించి వివరించి వైయస్సార్‌ కుటుంబంలో చేరాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలలో జగనన్నను ముఖ్యమంత్రి చేయడానికి మనమంతా కృషిచేయాలని అన్నారు. ఈకార్యక్రమంలో మరడాన కిశోర్,బోను శివున్నాయుడు,నరాల షణ్ముఖరావు,షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు.
....................................................
మోసం చేసిన టీడీపీకి బుద్ధి చెప్పాలి
లావేరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని వైయస్సార్‌ సీపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు రొక్కం బాలక్రిష్ణ, మండల అధ్యక్షుడు దన్నాన రాజినాయుడులు అన్నారు. మండలంలోని పాతకుంకాం, చినరొంపివలస, కేశవరాయునిపురం గ్రామాల్లో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వైయస్సార్‌ సీపీ నాయకులు, బూత్‌ కమిటీ కన్వీనర్‌లు, సభ్యులు గ్రామాల్లో ఇంటి ఇంటికి వెళ్లి ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఎలా మోసం చేశారో ప్రజలకు వివరించారు. జగన్‌ ప్రకటించిన నవరత్నాలు పథకాలు గురించి ప్రజలకు తెలియజేశారు. 9121091210కు మిస్‌డ్ కాల్‌ ఇచ్చి వైయస్సార్‌ కుటుంబంలో చేర్పించారు. కార్యక్రమంలో వైయస్సార్‌ సీపీ యువజన విభాగం లావేరు మండల మాజీ మండల అధ్యక్షుడు దంగుడుబియ్యపు మురళీ, జిల్లా నాయకులు గొర్లె అప్పలనాయుడు, మాజీ సర్పంచ్‌ పుచ్చల దాము, సీనియర్‌ నాయకులు శటికం వెంకటరమణ, కొరగాన రమణ, కార్యకర్తలు పాల్గోన్నారు.

Back to Top