సంబేపల్లె : టీడీపి ప్రభుత్వం వైఫల్యాలే వైయస్‌ఆర్‌సీపికి విజయాన్ని చేకూరుస్తాయని డీసీఎంఎస్ చైర్మైన్ ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి సోమవారం పేర్కొన్నారు. వెయస్‌ఆర్ కుటుంబంలో సభ్యులుగా చేరి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలుద్దామన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికలలో చంద్రబాబు అన్నివర్గాల ప్రజలకు అమలు గాని హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక వారిని మోసం చేశారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌రాజశేఖర్‌రెడ్డి ఉన్నన్ని రోజులు చంద్రబాబు కుప్పిగంతులు చెల్లలేదన్నారు. మండల పరిధిలోని రెడ్డివారిపల్లె, మాలపల్లెలో నిర్వహించిన వైయస్‌ఆర్ కుటుంబం కార్యక్రమంలో భాగంగా వారు ఇంటింటా తిరుగుతూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా పేదవాడు లబ్ది పొందుతారని తెలిపారు. ఈ సందర్భంగా 120 కుటుంబాలను ఇంటింటికీ వైయస్‌ఆర్ కుటుంబంలో సభ్యులను చేర్పించారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపి మండల కన్వినర్ ఉదయకుమార్‌రెడ్డి, పోలింగ్ బూత్‌కమిటీ సభ్యలు, కన్వీనర్లు, పాల్గొన్నారు.......................................................................కాశినాయన: వైయస్ జగన్ చేపట్టిన వైయస్సార్ కుటుంబానికి గ్రామాల్లో విశేష స్పందన లభిస్తోంది. సోమవారం మండలంలోని చెన్నవరం, రెడ్డి కొట్టాల గ్రామంలో పార్టీ మండల కన్వీనరు విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో వంద కుటుంబాలను వైయస్సార్ కుటుంబంలో చేర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎన్నికల హామీలను నెరవర్చేకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. జగన్ పార్టీ చేపట్టిన నవరత్నాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో బూత్ కమిటీ కన్వీనర్లు రామక్రిష్ణారెడ్డి, శ్రీనివాసులరెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.<br/>