వైయస్ఆర్ కడపః ఎమ్మెల్యే అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో కడపలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగింది. ప్రభుత్వ మోసపూరిత పాలనను గడపగడపలో ఎండగట్టారు. బాబు ఎన్నికల్లో ఇచ్చిన మోసపూరిత హామీలపై ప్రజాబ్యాలెట్ అందించి ప్రజలతో మార్కులు వేయించారు. ఈసందర్భంగా ప్రభుత్వంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క సంక్షేమ పథకం కూడా తమ దరిచేరడం లేదని వాపోయారు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన బాబు సర్కార్ కు తగిన బుద్ధి చెప్పాలని నేతలు పిలుపునిచ్చారు. <br/>