మలాపురం అర్బన్ ః నవరత్నాలు పేదల జీవితాలలో వెలుగునింపుతుందని వైయస్సార్‌సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి సంబటూరు ప్రసాద్‌రెడ్డి, సుమీత్రారాజశేఖర్‌రెడ్డిలు తెలిపారు. శనివారం పట్టణంలోని ఆకులవీధి, పాతకచేరి వీధులలోఖాజాహుస్సేన్, ఖాజాపీర్, గఫార్ బాషల ఆద్వర్యంలో జరిగిన వైయస్సార్ కుటుంబం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...జగన్ పిలుపు మేరకు ఇంటింటికి తిరిగి నవరత్నాలతో పేదలు కలిగే లబ్ధిని తెలియచేస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించాలనే ధ్యేయంతో ఉన్నారన్నారు. సంక్షేమ పథకాలు పేదలకు అందించాలనే సంకల్పంతో జగన్ ఈ నవరత్నాలు ప్రకటించారన్నారు. కాలనీలలో ప్రతి ఇంటికి వెళ్ళి నవరత్నాల గురించి తెలియపరుస్తూ, ఇంటింటికి స్టిక్కర్‌తో పాటు కరపత్రాలు పంపీణీ చేశారు. అలాగే కె.కొత్తపల్లె గ్రామంలో మారుజొళ్ళ మునిరెడ్డి, రఘునాద్‌రెడ్డి, అల్లె రాజారెడ్డి, మల్లికార్జునరెడ్డిలు వైఎస్సార్ కుటుంబం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ సీపీ నాయకులు సుధా కొండారెడ్డి, ఖాదిరి తదితరులు పాల్గొ న్నారు.<br/>