నవరత్నాలతో పేదల అభివృద్ధి

ఏర్పేడుః వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలతో పేదలందరు అభివృద్ధి చెందుతారని ఆ పార్టీ మండల అద్యక్షుడు తోటకూర కోటేశ్వరరావు అన్నారు. మంగళవారం మండలంలోని పాతవీరాపురం, ఎస్టీకాలనీలో ఇంటింటికి వైయ స్సార్‌ కుటుంబం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలతో గ్రామాలలో అభివృద్ధి పూర్తిస్థాయిలో జరుగుతుందన్నారు. ఇంటింటికి వెళ్లి నవరత్నాల పథకాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించి కరపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సింగిల్‌ అద్యక్షుడు తాళ్లపాక నాగార్జునరెడ్డి, ఎంపీటీసీ చెంబేటి మునిరత్నంరెడ్డి, మాజీ ఎంపీటీసీ కోదంరామిరెడ్డి, మాజీ సర్పంచ్‌ రాజారెడ్డి, నాయకులు పాతగుంట గురవారెడ్డి, జమున, రెడ్డెప్ప, మోహన్‌రెడ్డి, సరస్వతి, బుజ్జమ్మ, రాముడు తదితరులు పాల్గొన్నారు.
.............................................
రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం
వాల్మీకిపురంః దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి రాజ్యం మరలా తీసుకురావాలంటే ఒక్క జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమని మండల పార్టీ అధ్యక్షులు నీళ్ళ భాస్కర్, జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు శ్రీధర్‌రాయల్‌లు అన్నారు. మంగళవారం పట్టణంలోని హాసన్‌ఖాన్‌వీధి, తోటవీధిలలో
నవరత్నాల పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సంధర్భంగా ప్రజలకు కరప్రతాలు పంపిణీ చేసి వైయస్సార్‌ కుటుంబంలో సభ్యులుగా చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ నాయకులు మునీశ్వర, శంకర, రవి, మహబూబ్‌బాషాలు పాల్గొన్నారు.
............................................

నవరత్నాల అమలుతో మంచి రోజులు
బైరెడ్డిపల్లెః వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలతో ప్రజలకు మంచి రోజులు వస్తాయని రాష్ట్ర వైయస్సార్‌సీపీ కార్యదర్శి మొగసాల క్రిష్ణమూర్తి పేర్కొన్నారు. మండల పరిదిలోని కడపనత్తం గ్రామంలో మండల కన్వీనర్‌ ఆర్‌.కేశువులు ఆద్వర్యంలో వైయస్సార్‌ కుటుంబం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. పేద ప్రజలకు నవరత్నాల పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. వైయస్సార్‌ కుటుంబంలో సభ్యత్వం తీసుకొని వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో పార్టీ సంయుక్తకార్యదర్శి దయానందగౌడు,నాయకులు పైజుల్లా, లక్ష్మినారాయణ, శ్రీనివాసులరెడ్డి, పురుషోత్తంనాయుడు, బాలక్రిష్ణ, చంద్రప్ప, బాస్కర్, బయప్ప తదితరులు పాల్గొన్నారు.



Back to Top