నవరత్నాలతోనే రాజన్న రాజ్యం

మారేడుమిల్లి (రాజ‌మండ్రి):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన నవరత్నాలతో రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని ఆ పార్టీ రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. శుక్రవారం చిలుకుధారలో ఆమె పార్టీ శ్రేణులతో కలిసి వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మ‌న్ని నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి నవరత్నాల పథకాల ప్రయోజనాలను వివరించారు. అనంతరం కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే పలువురి చేత 91210 91210 నంబర్‌కు మిస్ట్‌కాల్‌ ఇవ్వడం ద్వారా వైయ‌స్ఆర్ కుటుంబంలో భాగ‌స్వాములు కావాల‌ని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేశ్వరి మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా నవరత్నాల పథకాలను జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించారన్నారు. అధికార దాహంతో, అబద్ధపు హామీలతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని విమ‌ర్శించారు. జ‌డ్పీటీసీ సభ్యుడు సత్తి సత్యనారాయణ రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గొర్లె అనిల్‌ ప్రసాద్‌(బాబి), నాయకులు బలుసుమిల్లి వెంకట్రావు(చంటి), బి.గంగరాజు, గొర్లె నారాయణ రావు, కాసగాని సురేష్‌ గౌడ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

నర్సింగపేటలో..
వైయ‌స్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని శుక్రవారం నర్సింగపేటలో నిర్వహించారు. బూత్‌ కన్వీనర్‌ అరవా దివాకర్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి నవరత్నాల పథకాలను వివరించి, కరపత్రాలు అందజేశారు. అలాగే పలువురిని వైయ‌స్ఆర్ కుటుంబంలో మ‌మేకం చేశారు.  మండల కన్వీనర్‌ ఆలూరి కోటేశ్వరరావు, బీసీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఆవుల మరియాదాస్‌ మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  నవరత్న పథకాలను ప్రకటించారని తెలిపారు. 
Back to Top