అన్ని అర్హతలున్నా అందని సంక్షేమ ఫలాలు

విశాఖపట్నం))సంక్షేమ పథకాలు తమ దరికి చేరడం లేదని పేద ప్రజలు వాపోయారు. గడపగడపకు వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ జీవీఎంసీ 47వ వార్డు గణపతినగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. గతంలో ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు వైద్య సేవలందేవని, ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. అర్హులందరికీ ఇంటి పట్టాలిస్తామన్నారని, కానీ ఇప్పుడు కాసులు ఇచ్చిన వారికే పట్టాలు ఇస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. పింఛన్లు, రేషన్ లు సరిగా అందడం లేదని వాపోయారు. అర్హులకు పట్టాలు వచ్చేలా అధికారులతో మాట్లాడుతానని విజయప్రసాద్ హామీ ఇచ్చారు. 


Back to Top