ఆలమూరు: మండలంలోని సంధిపూడిలో మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైయస్సార్ కుటుంబం కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాసు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే ఈకార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని ఇంటింటికి ప్రచారం చేపట్టి పార్టీ అధినేత జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాల కోసం వివరించనున్నారన్నారు. వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు మోటుపల్లి వెంకన్న, సర్పంచ్ ఎలుగుబంటి నాగమణి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.=========22వ వార్డులో వైయస్సార్ కుటుంబంపెద్దాపురం: వైయస్సార్ సీపీ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు ప్రజా సంక్షేమానికి ప్రజలకు ఆకర్షణగా నిలుస్తాయని వైయస్సార్ సీపీ కౌన్సిలర్ వాసంశెట్టి గంగ అన్నారు. పట్టణంలోని 22 వార్డుల్లో సోమవారం ఇంటింటా వైయస్సార్ కుటుంబం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ గంగ మాట్లాడుతూ... ప్రతీ కుటుంబం వైయస్సార్ కుటుంబంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. వార్డు పరిధిలోని ఆయా వీధుల్లో అడ్డూరి శ్రీను, ఎస్‌కె శ్రీనులతో కలిసి ఆయన ఇంటింంటా వైయస్సార్ కుటుంబం నిర్వహించారు...................................ప్రజాకర్షణగా వైయస్సార్ సీపీ నవరత్నాలుపెద్దాపురం: వైయస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు ప్రజా సంక్షేమానికి, ప్రజల ఆకర్షణగా నిలుస్తాయని, ప్రతీ కుటుంబం వైయస్సార్ కుటుంబంలో భాగస్వాములను కావాలని వైయస్సార్ సీపీ పెద్దాపురం నియోజవకర్గ కో–ఆర్డినేటర్ తోట సుబ్బారావు అన్నారు. వైయస్సార్ కుటుంబం కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని సిరివాడ, పులిమేరు గ్రామాల్లో నిర్వహిస్తున్న వైయస్సార్ కుటుంబం కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సుబ్బారావు నాయుడు మాట్లాడుతూ.... రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన సాగించాలంటే జగన్‌తోనే సాధ్యమన్నారు. ప్రతీ కార్యకర్త పార్టీ బలోపేతానికి గాను ప్రతీ ఇంటికి నవరత్నాలును ప్రకటించి వైయస్సార్ కుటుంబంలో భాగస్వాములను చేయాలన్నారు. అనంతరం. బూత్ కమిటీ సభ్యులతో కలిసి ఆయా గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యినకొండ వీర విష్ణుచక్రం, సిరివాడ గ్రామ సర్పంచ్ బూరాడ వీర్రాఘవమ్మ అప్పలరాజు, తుమ్మల అచ్యుతరామయ్య, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు................................
ప్రజల గుండెల్లో వైయస్‌ది చెరగని ముద్రదత్తిరాజేరు; స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డిది ప్రజల గుండెల్లో చెరగని ముంద్ర అని వైయస్సార్‌సీపీ మండల పార్టీ అద్యక్షుడు కడుబండి రమేష్‌నాయుడు అన్నారు. సోమవారం మండల యువజన నాయకులు సామిరెడ్డి కుమార్‌నాయుడు ఈశ్వరారావు ఆధ్వర్యంలో ఇంటింటికి వైయస్సార్ కుటుంబం కార్యక్రమంలో భాగంగా....ఇంటింటికీ తిరిగి జగనన్న పేద మధ్య తరగతి ప్రజలను ఆదుకోవడం కోసం ప్రవేశపెట్టిన నవరత్నాలుపై వివరించారు. ప్రతి కుటుంబం నుండి ప్రభుత్వం చేసిన మోసాలను విన్న అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఏఒక్క పేదవాడికి పింఛను కాని, ఇళ్లుకాని ఇతర పథకాలు అందించడంలో విఫలమయ్యారని అన్నారు. అమ్మఒడి, మహిళలకు ఆసరా... పేదవాడికి సంజీవనీ లాంటి ఆరోగ్యశ్రీ , అర్హులకు 2వేలు పింఛను, ఇళ్ల మంజూరు వంటివి అమలు కావాలంటే మరలా రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని అన్నారు. ....................................................ఇంటింటా వైయస్సార్ కుటుంబంమెంటాడ:మండలంలోని కొంపంగి గ్రామాలలో సోమవారం కొంపంగిలో సర్పంచ్ సారిక సురేష్, ఎజ్జిపరపు సీతంనాయుడు ఆధ్వర్యంలో ఇంటింటా వైయస్సార్ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతీ ఇంటికీ వెళ్లి వై.యస్. జగన్మోహనరెడ్డి ప్రకటించిన నవరత్నాలపై ప్రజలకు వివరించారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే అందరికి సంక్షేమ పథకాలు అందుతాయని వారు వివరించారు. రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యమని ప్రజలకు వివరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారం కోసం సాధ్యంకాని 600 హామీలు ఇచ్చి గద్దెనెక్కి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశాడని మండిపడ్డారు. ఈ విషయం ప్రతీ ఒక్కరూ తెలుసుకొని వచ్చే ఎన్నికలో చంద్రబాబుకు తమ అమూల్యమైన, వజ్రం లాంటి ఓటుతో బుద్ధి చెప్పాలని కార్యకర్తలు, బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.