తాడిపత్రి టౌన్: తాడిపత్రి మున్సిపల్ పరిధిలోని శ్రీరాములపేట, గణేష్‌నగర్‌లో వైయస్సార్ కుటుంబం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల ఉపయోగాలను తెలిపారు. అనంతరం ఆయా కుటుంబ సభ్యులకు సభ్యత్వం కల్పించారు. పార్టీ పట్టణ కన్వీనర్ రామ్మోహన్‌రెడ్డి, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు మున్నా, మైనారిటీ నాయకుడు జబ్బార్ బాషా, స్టీరింగ్ కమిటీ మాజీ సభ్యుడు భాస్కర్‌రెడ్డి, యూత్ విభాగం రూరల్ కన్వీనర్ ఓబుళరెడ్డి, పట్టణ శాఖ సభ్యులు ప్రదీబ్‌రెడ్డి, మనోజ్, నాయకులు రంగనాథరెడ్డి, శివారెడ్డి పాల్గొన్నారు.------------------------------విడపనకల్లు : మండల కేంద్రంలో బీసీ, బెస్త కాలనీల్లో వైయస్సార్‌సీపీ బూత్ కమిటీ కన్వీనర్లు బి.సుంకన్న, నాగేంద్ర, రాజశేఖర్, బడుగుల వెంకగేశుల ఆధ్వర్యంలో వైయస్సార్ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. నవరత్నాల పథకాల గురించి వివరించారు. అనంతరం ప్రజలకు వైయస్సార్‌సీపీ సభ్యత్వం అందజేశారు. ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ సభ్యులు గోవప్ప, రామాంజనేయులు, వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.