అవినీతి ప్రభుత్వాన్ని నిలదీసేందుకుంఅసమర్థ ముఖ్యమంత్రిని ప్రశ్నించేందుకుంఅభివృద్ధిని అణువంతైనా చూపని పాలనకు చరమగీతం పాడేందుకు..ప్రజాపక్షాన నిలిచేందుకుంప్రజాగళం వినిపించేందుకుంవైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరంభించారు ప్రజాసంకల్ప పాదయాత్ర. తన అడుగులతో కురిపిస్తు పాదయాత్రికుడికి, న్నసంకల్ప ధీరుడికీ ఈ రాష్ట్రమే చెబుతోంది పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ సందర్భంలో ప్రజా సంకల్ప యాత్ర ఆరంభంలో వైయస్ జగన్ మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. పాదయాత్రకు ముందు జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ఉద్వేగంతో మాట్లాడారు. పేదవాడికి సాయం చేయాలనే కసి గుండెల్లో ఉందన్నారు. అధికారంలోఉన్నవాళ్లు ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టినా, ప్రజలు వెన్నంటి ఉండటం చూసి ఎంతో ధీమాగా అనిపించిందని అన్నారు. ‘చంద్రబాబు లా నాకు కాసులంటే కక్కుర్తి లేదు, ఆయన మాదిరిగా నేను కేసులకు భయపడే ప్రసక్తి లేదు’ అన్నారు యువనేత. ఇది ఓ ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాధినేతకు విసిరిన సవాల్. అధికార పక్షం ఎన్నో విధాలుగా కక్షగట్టినా నిర్భయంగా ఎలా ఉన్నాడో నిజాయితీగా ఓ నాయకుడు చెప్పిన సందర్భం. ‘నాలో ఉన్న కసి ఒక్కటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవాలి. రైతుకు వ్యవసాయాన్ని మళ్లీ పండుగ చేయాలి. ప్రతి నిరుద్యోగికీ ఉద్యోగం అందిచగలగాలి. ప్రతి పేద విద్యార్థీ ఉన్నత చదువులు చదువుకోగలగాలి. పేదవాడు ఉచితంగా వైద్యం చేయించుకోగలగాలి. మద్యపానాన్ని నిర్మూలించగలగాలి. మంచి పనులతో మా నాన్న లా నేనూ ప్రతి మనిషి గుండెల్లో కలకాలం నిలిచిపోవాలింఇదే నా కసి’ అని చెప్పారు వైయస్ జగన్. వెతికి చూసినా చంద్రబాబు 2014 ఎన్నికల మేనిఫెస్టో కనిపించడం లేదన్నారు ప్రతిపక్షనేత. అది కనిపిస్తే చంద్రబాబు కాలర్ పట్టుకుని మరీ ప్రజలు హామీల గురించి అడుగుతారని మేనిఫెస్టోని మాయం చేసారన్నారు వైయస్ జగన్. చంద్రబాబు లా మోసం చేయడం తనకు చేతకాదన్నారు. ప్రజల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారౌతుందని చెప్పారు. నవరత్నాలతో పాటు ప్రజలకు కావాల్సినవేమిటో పాదయాత్రలో అడిగి తెలుసుకుని వాటిని మేనిఫెస్టోలో చేరుస్తామని మాటచ్చారు. ఇది ప్రజలు తమకోసం తాము సిద్ధం చేసుకునే మేనిఫెస్టో అని చెప్పారు. ప్రజాసంకల్ప యాత్రలో ప్రభుత్వం చేస్తున్న దారుణాలకు ప్రజలతో మమేకమై ప్రజలతోనే సమాధానం చెప్పిస్తానని అన్నారు వైయస్ జగన్. ఎప్పటిలాగే రాష్ట్ర ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. ప్రజాకంటక పాలనకు వ్యతిరేకంగా తీసుకున్న సంకల్పానికి తొలి అడుగు ప్రజల హర్షధ్వానాల మధ్య మొదలైంది. అదే ఊపు నేటికీ కొనసాగుతోంది. సంవత్సరకాలంగా ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతోంది. అదే జన ప్రభంజనం. అదే ప్రజా వెల్లువ. అదే అభిమానం. అదే కోలాహలం. రోజు రోజుకూ వటుడింతై అన్నట్టు పెరుగుతున్న వైయస్ జగన్ ఆదరణను చూసి ప్రభుత్వం కళ్లు పచ్చబడుతున్నాయి. ఓ పక్క ప్రభుత్వ దమననీతిని నిరసిస్తూ నిలదీస్తూ, మరో పక్క ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూ, కఅటు కేంద్రంతో, ఇటు రాష్ట్రంతో ఏక కాలంలో పోరాటం చేస్తూ, చంద్రబాబు అధర్మపోరాటాలకు అడ్డు నిలుస్తూ, ప్రజాపక్షాన నిలుస్తూ సాగుతోంది ప్రజాసంకల్పయాత్ర. ప్రజల సమస్యలకు పరిష్కారాలను ప్రజా మేనిఫెస్టోతో సిద్ధం చేస్తోంది. నవరత్నాలతో రాష్ట్రానికి మంచి రోజులని భరోసా ఇస్తోంది. ప్రాణం తీయబోయినాపట్టపగలే భద్రతా వలయాలను ఛేదించుకుని ఆగంతకుడి రూపంలో వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగింది. పదునైన ఆయుధంతో ప్రాణం తీసేందుకు సిద్ధపడ్డ వ్యక్తి వెనుక చాలా పెద్ద తలలే ఉన్నట్టు సాక్ష్యాలు రూఢీ చేసాయి. కానీ తీగలాగితే కదిలే డొంకను చప్పుడు చేయకుండా దాచిపెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఇంతటి ఆపద ఎదురైనా, ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉందని తెలిసినా వైఎస్ జగన్ వెరవలేదు. వెనక్కు తగ్గలేదు. గాయం పూర్తిగా మానకుండానే తన పాదయాత్రను తిరిగి ఆరంభించారు. బెదిరింపులు, దాడులు తన ఆశయాన్ని చంపలేవని చిరునవ్వుతోనే సమాధానం చెప్పారు వైఎస్ జగన్. అలుపెరుగని యోధునికి గాయాలు అడ్డంకి కాదని నిరూపించారు. సంకల్పధీరుడిలా ఆ యువనాయకుడు కదిలి వస్తుంటే కదన రంగంలో కాలుపెడుతున్న వీరుడుని చూస్తున్నట్టు ఉందంటున్నారు ప్రజలు. వెనకడుగు వేయని వ్యక్తిత్వం, ప్రజల కోసమే పనిచేసే శ్రమతత్వం వైయస్ జగన్.