<br/>చంద్రబాబు మాయానాటకం ధర్మపోరాట దీక్ష మరోసారి ప్రదర్శించబడుతోంది. ఈసారి వేదిక కడప జిల్లా పొద్దుటూరులో. పచ్చని అబద్ధాలు, కమ్మని కోతలు వీనులు విందుగా వినబడుతున్నాయి. ఈ సభలో సిఎం రమేష్ సింహం మాస్కు పెట్టుకున్న గుంటనక్కలా కనిపిస్తున్నాడు. అంతే మరి దొంగ పోరాటాలు చేసి, గ్రాము బరువు తగ్గని నిరాహారదీక్షలు చేసి, నిన్నటికి నిన్న ఐటి సోదాల్లో అడ్డంగా దొరికి, దొంగలెక్కలు, బినామీ కంపెనీల గుట్టు రట్టై, ఓటుకునోటులో సొమ్ములు ఈయనగారి ఎంక్కౌంట్ నుండి డ్రా అయ్యాయనే వాస్తవాలు బైటపడి కేడీ ఆఫ్ ఎపి అని ప్రజలందరికీ అర్థం అయిన తర్వాత కూడా డాంబికాలు చూపించే సిఎమ్ రమేషన్ ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. టిడిపి మంత్రులు ఎన్డీయే నుంచి వైదొలగినందుకే కేంద్రం తమపై పగబట్టిందని బింకాలు పలకడం సిఎం రమేష్ లోలోపలి భయం ఎంత ఎక్కువగా ఉందో అర్థం అవుతోంది. అంటే ఎన్డీయేతో కలిసి ఉన్నన్నాళ్లూ వారి అవినీతి గుట్టును రట్టు చేయకుండా బిజెపి కాపాడిందన్నమాట. తెగతెంపులు చేసుకోగానే పగబట్టి వీళ్ల అవినీతిని బయటపెడుతోందన్నమాట. తోడుదొంగల్లా నాలుగున్నరేళ్లుగా రాష్ట్రాన్ని మోసం చేసిన సంగతి సిఎం రమేష్ ఇలా తనమాటల్లోనే బయటపెట్టాడు. చివరకు తన కక్షనంతా వైఎస్ జగన్ మీద కుమ్మరించాడు. కడపలో పుట్టి మోదీ కాళ్లు పట్టుకున్నాడంటూ వెర్రి మాటలు మాట్లాడాడు. కేంద్రంతో అధికారం పంచుకున్నది టిడిపి. కేంద్రంతో కలిసి హహోదాకు పాడెకట్టింది టిడిపి. మోదీపై అవిశ్వాసం పెట్టేందుకు కలిసి రమ్మని జగన్ పిలుపునిస్తే, ముందు ఔనని తర్వాత కాదని, మేము ప్రత్యేకంగా తీర్మానం చేస్తామని తప్పుకుంది టిడిపి. అవిశ్వాసం తర్వాత ఎంపిలతో రాజీనామాలు చేయించి, నిరాహారదీక్షకు దిగి కేంద్రం మొడలు వంచుదామని జగన్ ప్రతిపాదిస్తే, మోదీ లేనప్పుడు ఆ ఇంటి ముందు అల్లరి చేసి ఎపికి పారిపోయి వచ్చింది టిడిపి. రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిల అధినాయకత్వాన్ని ఎదిరించి నిలిచిన ఒకే ఒక్కడు వైఎస్ జగన్ అని జాతీయ మీడియాసైతం ఘనంగా చెప్పింది. సోనియాను, మోదీని ఎదుర్కుంటున్న యువ నాయకుడు జగన్ మాత్రమే అని తెలుగు ప్రజలకు ఎప్పుడో తెలుసు. తనపై హత్యాయత్నం జరిగినా చంద్రబాబులా అరిచి పెడబొబ్బలు పెట్టకుండా, హుందాగా ప్రవర్తించిన నాయకుడు జగన్ ని చూసి దేశమే విస్తుపోయింది.ఐటి, ఈడి, సిబిఐలతో గంపగుత్తి కేసులు పెట్టించి, కుట్రలతో జైల్లో ఉంచినా జగన్ తొణకలేదు బెణకలేదు. ఐటి సోదాలు చేస్తే రాష్ట్రం మీదే దాడులు అంటూ చంద్రబాబులా పెడబొబ్బలు పెట్టలేదు.ధైర్యం ఎవరిసొత్తో, పిరికితనానికి పేటెంట్ ఎవరిదో అందరూ చూస్తూనే ఉన్నారు.సిఎం రమేషే కాదు సాక్షాత్ సిఎమ్మే చెప్పినా జగన్ కి భయం అంటే జనాలు నమ్మరు అని తెలుగు తమ్ముళ్లకు ఎప్పుడు అర్థం అవుతుందో ఏమో??<br/><br/>