ఉచిత ఇసుక అంటూ.. చంద్రబాబు కుచ్చుటోపీ

ఎక్స్ వేదిక‌గా కూట‌మి స‌ర్కార్ తీరును ఎండ‌గ‌ట్టిన వైయ‌స్ఆర్‌సీపీ 

తాడేపల్లి: ఏపీలో పథకాల అమలును కూటమి సర్కార్‌ గాలికొదిలేసింది. నాలుగు నెలల్లో ఒక్క పథకం కూడా అమలు చేయకుండా.. గత ఐదేళ్లలో అందిన పథకాల్లో కోతలు విధిస్తోంది. అలాగే, ఉచిత ఇసుక అంటూ చంద్రబాబు కుచ్చుటోపీ పెట్టాడు. కూటమి సర్కార్ తీరును వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌ వేదికగా ఎండ‌గ‌ట్టింది. 

నాలుగు నెలల్లోనే ఇసుకని సాంతం దోచేసిన తెలుగు తమ్ముళ్లు.వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిండుగా కనిపించిన ఇసుక యార్డులన్నీ ఇప్పుడు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఉచిత ఇసుక అంటూ.. చంద్రబాబు కుచ్చుటోపీ పెట్టాడు. ఇప్పుడు ఇసుక లేదంటే జనం ఉమ్మేస్తారని భయపడి.. ఆన్‌లైన్ బుకింగ్‌ పేరుతో కూటమి ప్రభుత్వం నాటకాలాడుతోంది.

ఇసుక ఫ్రీ అన్నది పెద్ద జోక్
తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఇసుక వ్య‌ధ‌లు ఎక్కువ‌య్యాయి. అధికారంలోకి వ‌చ్చి రాగానే అప్పటి వరకు ప్రతి పాయింట్ లో చేర్చిన ఇసుకను రాత్రికి రాత్రి తెలుగుదేశం పెద్దలు మాయం చేసారు. రాష్ట్రం అంతా కలిపి ఇలా మాయం చేసిన ఇసుక విలువ కోట్లలోనే. ఇలా జ‌రుగుతోంది అని చూసి, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కలిసి ఫ్రీ ఇసుక అనే నిర్ణయం తీసుకునే సరికే ఇసుక పాయింట్లలో ఇసుక ఖాళీ అయిపోయింది. దాంతో ఇసుక రేట్లు అమాంతం పెరిగిపోయాయి.  ప్రభుత్వం చాలా రూల్స్ పెట్టింది. ప్రయోగాలు చేస్తోంది. కానీ ఇసుక రేటు దిగి రావడం లేదు. ఇసుక ఫ్రీ అన్నది పెద్ద జోక్ గా మారిపోయింది. ప్రభుత్వం ఎన్ని రూల్స్ పెట్టినా ఇసుక పక్కదారి పడుతోంది. 

ఈస్ట్ గోదావరిలో ఇసుక లారీని ర్యాంప్ నుంచి తెచ్చాక, దగ్గరలోని బోరింగ్ దగ్గరకు తీసుకెళ్తారట లారీని. వంద రూపాయిలు ఇస్తే లారీలో వున్న ఇసుక అంతా చాలా బలంగా తడిపేస్తారట. అప్పుడు వే బ్రిడ్జి దగ్గరకు తీసుకెళ్లి కొత్తగా బరువు తూస్తారు. టన్నుల లెక్కలో అమ్ముతారు కనుక, తడిసిన ఇసుక మరింత బరువు అవుతుంది. ఇలా రకరకాల మార్గాల ద్వారా ఇసుక రేట్లు పెంచి నల్ల బజారుకు తరలించడం వెనక సూత్ర ధారులు లోకల్ ఎమ్మెల్యేకు రోజుకు ఇంత అని కప్పం కట్టడం ఒకటి ఇప్పటికే ఫిక్స్ అయిందట. అలాగే అధికార పార్టీ లీడర్లకు రోజుకు ఇంత, అ ఏరియాలో తిరిగే లారీకి ఇంత అని చెల్లింపులు మొదలయ్యాయట. చాలా ఏరియాలో ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. దీని వల్ల ఇసుక దొరక్క, దొరికినా భారీ రేటు పెట్టలేక, నిర్మాణ పనులు మందగించాయి.
వైయ‌స్ఆర్‌సీపీ ఐదేళ్ల పాల‌న‌లో ఇసుక కోసం పెద్దగా ఇబ్బంది పడలేదు. మరీ అబ్ నార్మల్ గా ఇసుక రేట్లు పెరిగిందీ లేదు.
ఈ ఇసుక బాధలు ఏ మీడియా రాయదు. ముఖ్యంగా తెలుగుదేశం అనుకుల మీడియా అస్సలు రాయదు.  

Back to Top