అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వ కక్ష సాధింపు కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంటూరి రవి కిరణ్ పై బాపట్ల జిల్లా ఇంకోలు పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదు చేశారు. విశాఖ సెంట్రల్ జైల్ నుంచి బాపట్లకు ఇంటూరిని తరలించారు. ఇప్పటివరకు ఇంటూరిపై 14 కేసులు నమోదు చేశారు. విశాఖ సెంట్రల్ జైల్‌లో ఉన్న మరో సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఖాజా బాబాపై రామచంద్రపురం పీఎస్‌లో అక్రమ కేసు బనాయించారు. ఫేక్ ఐడీలతో బోగస్ ప్రచారం టీడీపీకి అలవాటే: మార్గాని భరత్ ఫేక్ ఐడీలతో బోగస్ ప్రచారం టీడీపీకి అలవాటే అని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ అన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్ర రెడ్డి పేరుమీద ఫేక్ అకౌంట్లతో పోస్టులు పెట్టారని మండిపడ్డారు. ఫేక్ ఐడీలతో బోగస్ ప్రచారం చేయడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. వైయస్ జగన్ తన తల్లిని, చెల్లిని కూడా అమ్మా అనే మాటతో సంబోధిస్తారు. అది మహిళలకు ఆయనిచ్చే గౌరవమని పేర్కొన్నారు. ప్రశ్నించినందుకు సురేష్ రెడ్డి అక్రమ అరెస్ట్.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన కాసు మహేష్ రెడ్డికి అనుచరుడు, గురజాల సోషల్ మీడియా కోఆర్డినేటర్ సురేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సురేష్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.