అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. అనంతపురం నగరంలో ఆదివారం అనంతవెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు.. రాష్ట్ర విభజన గుణపాఠాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేర్చుకోలేదు వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి పై చంద్రబాబు కు చిత్తశుద్ధి లేదు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలు రాజధానిగా ఏర్పాటు రాజధాని ఒక చోట ఉంటే హైకోర్టు మరో ప్రాంతం లో ఉండాలని శ్రీబాగ్ ఒప్పందం చెబుతోంది ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ కలయిక కోసం కర్నూలు రాజధాని త్యాగం 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణకు విఘాతం కలిగిస్తే ఎలా? వైయస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు కేంద్రం గా న్యాయ రాజధాని ఏర్పాటు చేశారు కర్నూలు లో ఉన్న లోకాయుక్త హ్యుమన్ రైట్స్ కమిషన్ కార్యాలయాలను చంద్రబాబు తరలించడం దుర్మార్గం అనంతపురం జిల్లా కు మంజూరైన ఎయిమ్స్ ను అమరావతికి తరలించారు