తాడేపల్లి: మన రాష్ట్రంలోనే అతిపెద్ద రాష్ట్ర వ్యాప్త క్రీడా టోర్నమెంట్ ‘ఆడుదాం ఆంధ్ర’.. ఈ కార్యక్రమాన్ని ప్రకటించటంపై సంతోషిస్తున్నానని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘రాష్ట్రంలోని ప్రతి సచివాలయం పరిధిలో మ్యాచ్‌లు నిర్వహించబడుతున్నాయి. మన యువతకు అత్యుత్తమ అవకాశం ఉంటుంది. వారి క్రీడా ప్రతిభను పెంపొందించడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది. మన దేశపు తదుపరి క్రీడా ఛాంపియన్‌లుగా మారండి. ఇప్పుడే aadudamandhra.ap.gov.in లో పేరు నమోదు చేసుకోండి’’ అంటూ సీఎం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.