కాసేపట్లో ఏలూరుకు సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాసేపట్లో ఏలూరుకు చేరుకోనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు సీఎం కొద్దిసేపటి క్రితమే బయల్దేరారు. ఏలూరులో అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం వైయస్‌ జగన్‌ పరామర్శించనున్నారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 

Back to Top