డాక్టర్ బీఆర్ అంబేద్క‌ర్‌కు ఘ‌న నివాళులు 

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు

తాడేప‌ల్లి: రాజ్యాంగ ఆమోద దినోత్స‌వం సంద‌ర్భంగా తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్‌కు పార్టీ నేత‌లు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. రాజ్యాంగ‌ దినోత్సవాన్ని మంగ‌ళ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తాడేప‌ల్లిలోని కేంద్ర కార్యాల‌యంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పార్టీ నేతలు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు, పలు నియోజకవర్గాల ఇన్ఛార్జులు, కార్పోరేషన్ల మాజీ ఛైర్మన్లు, తదితరులు పూల‌ మాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్‌ ఆశయాలను నెరవేర్చేందుకు  ప్ర‌తి ఒక్క‌రూ ముందుకు సాగాలని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు పిలుపునిచ్చారు. 

అంబేద్కర్‌ ఆశయాలు సాధిద్దాం.. 
అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని  ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ అధికార ప్ర‌తినిధులు జూపూడి ప్ర‌భాక‌ర్‌, టీజేఆర్ సుధాక‌ర్‌బాబు పిలుపునిచ్చారు. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్‌ 26న పార్లమెంటరీ కమిటీలో బాబు రాజేంద్రప్రసాద్‌ ప్రవేశపెట్టగా ఆమోద ముద్ర వేశారని వివరించారు.  అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగాన్ని దేశంలో ఆమోదించి నేటికి 75 ఏళ్లు పూర్తయిందని గుర్తుచేశారు.  ప్రతి పౌరుడూ రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని కోరారు.  

Back to Top