చంద్ర‌బాబూ గుర్తుంచుకో.. అధికారం ఎల్లకాలం ఉండదు 

మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్‌

వైయ‌స్ఆర్‌సీపీ  శ్రేణులను వేధించడానికే పోలీసులను వాడుతున్నారు

అమాయకులను తెచ్చి ముద్దాయిలను చేస్తున్నారు

 కృష్ణా జిల్లా: చంద్రబాబు గుర్తించుకో..ఎల్లకాలం అధికారం ఉండ‌ద, ప్రభుత్వాలు శాశ్వతం కాద‌న‌ని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఈ  రోజు పసుపు చొక్కేలేసుకుని అక్రమంగా వ్యవహరిస్తున్న అధికారుల‌పై తప్పకుండా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంద‌ని ఆయ‌న హెచ్చరించారు. శ‌నివారం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

 రాష్ట్రంలో శాంతిభద్రతలను చంద్రబాబు సర్కార్‌ గాలికొదిలేసిందని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుందంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. తప్పుడు కేసులతో వైయ‌స్ఆర్‌సీపీ  శ్రేణులను వేధించడానికే పోలీసులను వాడుతున్నారంటూ ధ్వజమెత్తారు.

 పాత కేసులను తిరగదోడి.. తప్పుడు కేసులు పెడుతున్నారు. గన్నవరంలో 8 మంది వైయ‌స్ఆర్‌సీపీ  నేతలను అక్రమంగా కేసుల్లో ఇరికించారు. న్యాయమూర్తి 307 కేసును తొలగించారు. కానీ బెయిల్ విషయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పచ్చ చొక్కాల ఒత్తిడికి లొంగిపోయారు. కుంటిసాకులతో రెండురోజుల పాటు కాలయాపన చేసి పోలీస్ కస్టడీ కోరారు. రెండు సార్లు విచారణ అయ్యాక ఏముందని పోలీస్ కస్టడీకి కోరుతున్నార‌ని పేర్ని నాని ప్రశ్నించారు.

 అమాయకులను తెచ్చి ముద్దాయిలను చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ  జెండా, వైయ‌స్ జగన్ బొమ్మ పెట్టుకుని తిరగకుండా చేయాలని చూస్తున్నారు. అడ్డగోలుగా పోలీసులను వాడుతున్నారు. పాతకేసులను తిరగదోడుతున్నందుకు డీజీపీకి మా సూటిప్రశ్న. పాతకేసులకు సంబంధించి ఎస్సై, సీఐలను సస్పెండ్ చేశారా?. తప్పుడు ఉద్యోగం చేశావని ఒక్కరిపైనైనా చర్యలు తీసుకున్నారా?. చేసేవి దొంగ పనులు కాబట్టి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఒక్కొక్కరి పై 10, 20 కేసులు పెడుతున్నారు.

తమతో పాపాలు చేయిస్తున్నారని కొందరు పోలీసు అధికారులు బాధపడుతున్నారు. ఖాకీ యూనిఫాం వేసుకుని తప్పుడు కేసులు పెట్టి పాపాలకు పాల్పడుతున్నార‌ని పేర్ని నాని ఆక్షేపించారు.

Back to Top