హామీలకు.. బడ్జెట్ లెక్కలకు పొంతన లేదు

మండలి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ 

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉంటే ఈ ఆరు నెలల్లో రూ.18 వేల కోట్ల పేద ప్రజల ఖాతల్లో వేసేవాళ్ళం.

రూ.70వేల కోట్ల అప్పు ఏం చేశావు బాబూ?: బొత్స సత్యనారాయణ

 విశాఖపట్నం:కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలయిందని, ఎన్నికల్లో హామీలేవీ నెరవేర్చలేదని మండలి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు,గుడివాడ అమర్‌నాథ్‌,మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో కలిసి విశాఖపట్నంలో బొత్స సోమవారం(డిసెంబర్‌2) మీడియాతో మాట్లాడారు.

‘ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది. ఎన్నికల హామీలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు పొంతన లేదు.హామీలు నెరవేర్చకపోగా ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారం మోపారు.యూనిట్‌కు 1రూపాయి20పైసలు పెంచారు.

ప్రజలపై మొత్తం రూ.15 వేల కోట్ల భారం మోపారు. అప్పుల భారం పెంచుతున్నారని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు.మరి కూటమి ప్రభుత్వం అప్పులెందుకు చేస్తోంది. ఆరు నెలల్లో చేసిన రూ.70 వేల కోట్ల అప్పు ఎక్కడికి పోయిందో చెప్పాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి’అని బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. 

బొత్స ఇంకా ఏమన్నారంటే..

  • ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.
  • ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో చోటు లేదు.
  • హామీలకు బడ్జెట్ లెక్కలకు పొంతన లేదు.
  • ఎన్నికలకు ముందు కూటమి నేతలు నిత్యావసర వస్తులు పెంచమని  చెప్పారు.
  • చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ధరలు పెంచమని పదే పదే చెప్పారు.
  • యూనిట్ విద్యుత్ ధర 1.20 రూపాయలు పెరిగింది.
  • రూ. 15 వేల కోట్ల విద్యుత్ బారాన్ని ప్రజలపై ఈ ప్రభుత్వం మోపుతుంది.
  • విద్యుత్ చార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసం
  • అన్ని పరిణామాలు ఆలోచించే కదా ఎన్నికల్లో చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పారు.
  • రూ. 15 వేల కోట్ల బారాన్ని ప్రభుత్వమే భరించాలి
  • ప్రభుత్వమే డిస్కంలకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం
  • రూ 67 వేల 237 కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వం
  • ఈ మంగళవారం మళ్ళీ రూ. 4 వేల కోట్లు అప్పు చేయబోతున్నారు.
  • మొత్తం అప్పు రూ. 70 వేల కోట్లకు చేరుతుంది.
  • గతంలో మా ప్రభుత్వం డిస్కంలకు డబ్బులు చెల్లించాం.
  • పెన్షన్ తప్ప ఒక్క పథకం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు.
  • వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉంటే ఈ ఆరు నెలల్లో రూ.18 వేల కోట్ల పేద ప్రజల ఖాతల్లో వేసేవాళ్ళం.
  • గత సంవత్సరం ఇదే సమయానికి అమ్మఒడి,వసతి దీవెన,విద్యా దీవెన,రైతు భరోసా,సున్నా వడ్డీ,మత్స్యకార భరోసా,ఈబీసీ నేస్తం నిధులు ప్రజలకు ఇచ్చాం
  • ఈరోజుకి గత సంవత్సరంలో రూ. 18 వేల 200 కోట్లు ఇచ్చాం
  • ప్రజలకు పథకాలు ఇవ్వడం ఈ ప్రభుత్వం ప్రయారిటీ కాదు
  • పేద ప్రజలకు పథకాలు ఎప్పటి నుంచి ఇస్తారు
  • రూ. 67 వేల కోట్లు అప్పు తెచ్చి దేనికి ఖర్చు చేశారు
  • ప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం
  • పథకాలు ఇవ్వడం లేదు సరి కదా విద్యుత్ చార్జీల మోత మోగించి ప్రజల నడ్డి విరుస్తున్నారు
  • మా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పులు చేశామని గగ్గోలు పెట్టారు.. ఇప్పుడు అప్పులు చేసి మీరేం చేస్తున్నారు
  • మీ సోకులకు వాడుకుంటున్నారా..?
  • గతంలో కూడా చంద్రబాబు అప్పులు చేసి వెళ్తే మేం కూడా ఆ అప్పులు చెల్లించాం
  • ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయింది
  • గతంలో పథకాలు అందడం వలన మార్కెట్ మంచిగా ఉండేది
  • జీఎస్టీ తగ్గిపోతోంది..చాలా ఆందోళనగా ఉంది..
  • వ్యాపారాలు ఏమి జరగడం లేదు
  • వాటాల కోసం ఎమ్మెల్యేలు తన్నుకుంటున్నారు
  • దానికి సీఎం చంద్రబాబు పంచాయితీ ఏమిటి
  • ప్రభుత్వం అంటే భయం, భక్తి ఉండాలి.. ఏది లేకపోతే ఎలా..?
  • నూతన మద్యం పాలసీ వచ్చాక బెల్టు షాపులు ఎక్కువయ్యాయి
  • బెల్టు షాపులకు బహిరంగ వేలం వేస్తున్నారు
  • మా సమీప గ్రామంలో బెల్టు షాపు రూ. 50 లక్షలకు వేలం వేశారు
  • ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా..?
  • ఈనాడు, జ్యోతి కథనాలనే నేను చెప్తున్నాను
  • పవన్ కాకినాడ పర్యటన..గబ్బర్‌ సింగ్‌-3
  • పవన్ కాకినాడ పర్యటన.. గబ్బర్ సింగ్..3ని తలపించింది
  • పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా తప్పే.. చర్యలు తీసుకోండి
  • ఎమ్మెల్యేని కాంప్రమైస్ అయ్యావా..? అని పవన్ అడుగుతున్నారు
  • పక్కన ఉన్న మీ మంత్రి మాటేంటి..?
  • ఆయన చేతకాని వాడా..?
  • పోర్టులో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోండి
  • రెడ్డి, చౌదరి ఎవ్వరైనా తప్పు చేస్తే ఒకేలా స్పందించాలి
  • బియ్యం అక్రమ రవాణాపై బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి అనుమతులు ఇప్పించారు
  • నిజమా కాదా..? గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించుకోండి..
Back to Top