వక్ఫ్‌ బోర్డు జీవో ఉపసంహరణ నిర్ణయం దుర్మార్గం

మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌.బి.అంజాద్‌ బాషా ఆగ్ర‌హం

రాజ్యంగ బద్దంగా ఏర్పాటైన వక్ఫ్‌ బోర్డు కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం

వక్ఫ్‌ ఆస్తులను కొట్టేయాలనే దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం జీవో రద్దు చేసింది

వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించి మైనార్టీల పక్షపాతిగా నిలిచింది వైయ‌స్ఆర్‌సీపీ మాత్రమే

కూటమి నాయకులు మీ స్వార్ధ ప్రయోజనాల కోసం వక్ఫ్‌ భూముల జోలికి రావద్దు - అంజాద్‌బాషా

క‌డ‌ప‌: వక్ఫ్‌ బోర్డు జీవో ఉపసంహరణ నిర్ణయం దుర్మార్గమ‌ని మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌.బి.అంజాద్‌ బాషా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ ఆరు నెలల్లో ప్రజలకిచ్చిన హామీలు తుంగలొ తొక్కి కేవలం కక్ష సాధింపు ధోరణిలో ముందుకెళుతుంది. ఎన్నికల మందు కూటమి నాయకులు సూపర్ సిక్స్‌ అని అనేక హామీలు ఇచ్చి ఈ ఆరు నెలల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు, పైగా ప్రతి సందర్బంలో గత ప్రభుత్వం అంటూ మాపై నిందలు వేస్తున్నారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిప‌డ్డారు. కడపలోని తన క్యాంప్‌ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌.బి.అంజాద్‌ బాషా ఆదివారం మీడియాతో మాట్లాడారు. 

తాజాగా కూటమి ప్రభుత్వం వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో రాజ్యాంగ బద్దంగా ఏర్పాటైన వక్ఫ్‌ బోర్డును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమైన చర్య, వైయస్‌ జగన్ సీఎంగా ఉన్న సమయంలో మైనార్టీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ 21.10.2023 న జీవో నెంబర్‌ 47 ద్వారా వక్ఫ్‌ బోర్డు నియమించారు, దీనిని రద్దు చేస్తూ శనివారం జీవో ఇవ్వడం దారుణం, రాజ్యాంగ బద్దంగా వక్ఫ్‌ బోర్డును వైయస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్ణయించింది, దీనికి సంబందించి అన్నీ కూడా నోటిఫికేషన్‌ ప్రకారం సభ్యుల నియామకం కూడా చేశాం, అన్ని కేటగిరిలలో నియామకాలు అన్నీ కూడా గత ప్రభుత్వం నిబంధనల మేరకు నియమించింది. కానీ చంద్రబాబు, టీడీపీ నాయకులు దీనిపై హైకోర్టుకు వెళ్ళి ఛైర్మన్‌ నియామకాన్ని జరగకుండా నిలుపుదల చేశారు, ఈ పిటీషన్లన్నీ కూడా హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి, వక్ఫ్‌ బోర్డుకు ఐదేళ్ళ కాలపరిమితి అంటే 2028 వరకు ఉంటుంది, కానీ కూటమి ప్రభుత్వం ఆ జీవోను ఉపసంహరించుకుని టీడీపీ నాయకుల ద్వారా వక్ఫ్‌ బోర్డును ఆక్రమించుకోవడానికి సిద్దపడ్డారు

మైనార్టీల ఆస్తులన్నీ టీడీపీ నేతలు కాజేయడానికి ఈ కుట్ర చేస్తున్నారు, హైకోర్టులో రిట్‌ పిటీషన్లు వేసి వక్ఫ్‌ బోర్డు పనిచేయకుండా అడ్డుకుంది మీరు కాదా చంద్రబాబు, 2014లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నాలుగేళ్ళు వక్ఫ్‌ బోర్డు నియమించకుండా స్పెషల్‌ ఆఫీసర్‌ ద్వారా నడిపించారు, వక్ఫ్‌ చట్టాన్ని అతిక్రమించి 2018 వరకు స్పెషల్‌ ఆఫీసర్‌ ద్వారా నడిపించారు, 2019లో మేం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు 2018 లో నియమించిన బోర్డునే కొనసాగించాం కదా, అప్పుడు రాజీనామా చేసిన వారినే మేం కొత్తగా నియమించాం కానీ అదే బోర్డును కొనసాగించాం, మీరు చేస్తున్నది ఎంతవరకు సమంజసమో ఆలోచించండి

కూటమి ప్రభుత్వంలో తీసుకొచ్చిన వక్ఫ్‌ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది, దీనికి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకం, ఇక్కడున్న కూటమి ప్రభుత్వం వక్ఫ్‌ ఆస్తులను ఆక్రమించుకోవాలనే ఎత్తుగడతోనే ఇలా వ్యవహరిస్తుంది. మైనార్టీల ఆస్తులు అన్యాక్రాంతం చేసే ప్రయత్నాన్ని వైఎస్సార్సీపీ అడ్డుకుంటుంది. వక్ఫ్‌ చట్ట సవరణను మేం వ్యతిరేకిస్తున్నాం. దీనిపై మా నాయకుడు వైయస్‌ జగన్‌ చాలా స్పష్టంగా వైఖరి చెప్పారు, ప్రభుత్వం ఉపసంహరించుకున్న జీవోపై మేం న్యాయపోరాటం చేస్తాం, కూటమి నాయకులు మీ స్వార్ధ రాజకీయాల కోసం వక్ఫ్‌ బోర్డును వాడుకోవద్దని హెచ్చరిస్తున్నాం. మైనార్టీల పక్షపాతిగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ ఉంటుందని అంజాద్‌బాషా ఉద్ఘాటించారు..

Back to Top