బాధితురాలిని పరామర్శిస్తే కేసా?

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి

 
తిరుపతి: వైయ‌స్ఆర్‌సీపీ నేతలే లక్ష్యంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారనివైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాధితుడి విజ్ఞప్తి మేరకే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పరామర్శించారని తెలిపారు. బాధితురాలిని పరామర్శిస్తే చెవిరెడ్డిపై ప్రభుత్వం కేసు పెట్టింది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు.

ఆపదలో ఉంటే చెవిరెడ్డే ఆదుకున్నారు: బాధితురాలి తండ్రి 
మేము చెవిరెడ్డిపై ఎలాంటి పోక్సో, ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టలేదని.. తనకు చదువు రాదని కాగితాలపై పోలీసులే సంతకాలు పెట్టించుకున్నారని బాధితురాలి తండ్రి తెలిపారు. ఆపదలో ఉంటే చెవిరెడ్డే  మమ్మల్ని ఆదుకున్నారని ఆయన  చెప్పారు. ఆదుకున్నవారిపై మేము కేసు పెడితే మహాపాపం అని బాధితురాలి తండ్రి అన్నారు.

 

Back to Top