విద్యుత్ పై చంద్రబాబు అసత్యాల పత్రం 

వైయస్ఆర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి 

చంద్రబాబు అధికారంలోకి వచ్చేసరికి  2014-15 రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 59,198 మిలియన్ యూనిట్లు.

చంద్రబాబు పదవి నుంచి దిగిపోయేనాటికి (2018-19) మధ్య విద్యుత్ వినియోగం 63,675 మిలియన్ యూనిట్లు.

అంటే బాబు హయాంలో సాలీనా విద్యుత్ డిమాండ్ సగటు వృద్ది రేటు కేవలం 1.9 శాతం మాత్రమే

శ్వేతపత్రంలో మాత్రం 2014-19 మధ్య వినియోగం 36 శాతం పెరిగిందని బాబు అబద్దాలు.

వాస్తవానికి పెరిగిన వినియోగం కేవల 7.6శాతం మాత్రమే.

వైయస్.జగన్ హయాంలో 63,675 మిలియన్ యూనిట్ల నుంచి 2023-24 నాటికి 80,151 మిలియన్ యూనిట్లకు పెరిగిన 
పవర్ డిమాండ్.

అంటే వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో ఏకంగా 25 శాతం డిమాండ్ పెరిగింది వాస్తవం కాదా?

2014 మార్చినాటికి  డిస్కంలు, ట్రాన్స్కో, జెన్కో అప్పులు విద్యుత్ ఉత్పత్తిదారులకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.29,551 
కాగా.. చంద్రబాబు దిగిపోయేనాటికి  రూ.86,215 కోట్లకు చేరిన బకాయిలు. 

విద్యుత్ రంగంలో చంద్రబాబు తెచ్చిన అప్పులు రూ.56,663 కోట్లు 

వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు తెచ్చిన అప్పులు రూ.36,300 కోట్లు మాత్రమే 

పీపీఏల పేరిట సోలార్ కరెంటు కిలోవాట్ విద్యుత్కు రూ.5.25 నుంచి రూ.5.90 వరకు చెల్లించేలా బాబు ఒప్పందాలు చేసుకోలేదా?

పవన విద్యుత్కు యూనిట్కు రూ.4.84 చెల్లించేలా 41 సంస్ధలతో టీడీపీ ఒప్పందాలు చేసుకున్న మాట వాస్తవం కాదా?

ఈ ఒప్పందాల కోసమే ఒక పథకం ప్రకారం థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తగ్గించి, దెబ్బ తీసిన చంద్రబాబు 

ఉచిత విద్యుత్ అంటే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనన్న బాబు ఇప్పుడు నీతులా?

చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఉచిత విద్యుత్ కోసం పెట్టిన రూ.8,845 కోట్లను వైయస్.జగన్ హయాంలో చెల్లించిన మాట 
వాస్తవం కాదా?

మొత్తంగా ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కింద రూ.43,744 కోట్లు చెల్లించిన జగన్ సర్కారు

ఉచిత కరెంటు భవిష్యత్తులో నిరాటంకంగా అందించే లక్ష్యంతో వైయస్.జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంస్ధ సెకీతో ఒప్పందం కుదుర్చుంది

యూనిట్ రూ.2.49కే  ఇవ్వడానికి చర్యలు తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి.

కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ సంక్షోభాలను దాటుకుని వైయస్.జగన్ విద్యుత్ సంస్కరణలు. 

ట్రూ అప్ చార్జీలు ఎత్తేస్తానని చెప్పి ఇప్పుడు ఉలుకూ పలుకు లేదేం చంద్రబాబు?

విద్యుత్ రంగంలో చంద్రబాబు అస్తవ్యస్త విధానాలతో పలు డిస్కంలు మూత పడలేదా?

చంద్రబాబు శ్వేతపత్రంపై వాస్తవాలు వెల్లడించిన కాకాణి 

నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంధన రంగంపై అసత్యాలతో శ్వేతపత్రం విడుదల చేశారని, ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాటా పచ్చి అబద్ధమేనని మాజీ మంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉద్ఘాటించారు. చంద్రబాబు చేయని వాటిని కూడా తన గొప్పలుగా చెప్పుకున్నారని మండిపడ్డారు. విద్యుత్ రంగంలో చంద్రబాబు నిర్ణయాల వల్ల డిస్కంలు మూతపడ్డాయని గుర్తు చేశారు. కోవిడ్ సంక్షోభం, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ సంక్షోభాలను దాటుకుని జగన్ మోహన్ రెడ్డి గారు విద్యుత్ రంగాన్ని గాడిలోపెట్టారని చెప్పారు. నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… విద్యుత్ పై చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై వాస్తవాలను కాకాణి వెల్లడించారు. 

చంద్రబాబు అసత్యాల ప్రదర్శన
చంద్రబాబు తాను చేయని వాటిని తన గొప్పలుగా చెప్పుకున్నారని కాకాణి విమర్శించారు. ఇంధన రంగంపై చంద్రబాబు ప్రజెంటేషన్ పూర్తిగా అసత్యాలమయం అన్నారు. సంస్కరణలకు ఆద్యుడు అన్నట్టుగా చంద్రబాబు చెప్పుకున్నారన్నారు. ప్రజలకు విద్యుత్ పంపిణీ గురించి తెలియజేయడం కన్నా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి పనిగట్టుకుని ప్రజెంటేషన్ ఇచ్చారన్నారు. 2014-15 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు 59,198 మిలియన్ యూనిట్లు సంవత్సరానికి అవసరం ఉండేదన్నారు. 2018-19 అంటే చంద్రబాబు దిగిపోయేనాటికి 63,675 మిలియన్ యూనిట్లకు డిమాండ్ పెరిగిందన్నారు. కేవలం సగటున 1.9 శాతం వృద్ధి రేటు ఉందన్నారు. కొత్త కనెక్షన్లు ఇవ్వలేదన్నారు. డిమాండ్ పెరగకుండా ఆయన మేనేజ్ చేస్తూ వచ్చారన్నారు. జాతీయ సగటు వృద్ధి రేటు 4.5 శాతం ఉందని, జాతీయ వృద్ధి రేటులో దాదాపు మూడో వంతుకు ఆంధ్ర రాష్ట్రం పడిపోయిందన్నారు. 
2014-19  మధ్యలో వినియోగం దాదాపుగా 36 శాతం పెరిగిందని కాకిలెక్కలు కట్టి చంద్రబాబు డబ్బా కొట్టుకున్నారన్నారు. మొత్తం తీసుకున్నా 7.6 శాతానికి పరిమితమయ్యందని గుర్తు చేశారు. అదే వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత దాదాపుగా 25 శాతం డిమాండ్ పెరిగినట్లు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రిపోర్టు ఇచ్చిందన్నారు. ఇది వాస్తవమా? కాదా? అని ఆయన ప్రశ్నించారు.
2023-24 నాటికి 80,151 యూనిట్లకు ఈరోజు మనం ఆ డిమాండ్ ను పెంచుకోగలిగామన్నారు. అంటే దాదాపు 25 శాతం డిమాండ్ పెరిగిందని, సగటున ఏడాదికి వృద్ధి రేటు 4.7 శాతం ఉందన్నారు. 2019-24 మధ్య జాతీయ సగటు 4.9 శాతం ఉంటే, దాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల సగటున వృద్ధి రేటు 4.7 శాతానికి పెరిగిందన్నారు. చంద్రబాబు పాలనలో కోవిడ్ లేదని, ఉక్రెయిన్ వార్ లేదని, కోల్ సప్లయ్ లో సమస్యలు లేవని, అంతర్జాతీయంగా సరఫరాలో సమస్యలు లేకపోయినా చంద్రబాబు హయాంలో పెరిగిన డిమాండ్ 7.6 శాతం అయితే, వీటన్నింటినీ అధిగమించి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినది 25 శాతం పెరిగిందని  సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రిపోర్టు చెప్పిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. 

అప్పుల కుప్పగా మార్చిన చంద్రబాబు
2014 మార్చి నాటికి బకాయిలు రూ.29,551 కోట్లు ఉన్నాయన్నారు. చంద్రబాబు దిగిపోయేనాటికి ఉన్న అప్పులు రూ.86,215 కోట్లు అయితే…  విద్యుత్ రంగంలో చంద్రబాబు తెచ్చిన అప్పులు అక్షరాలా రూ.56,663 కోట్లు అని అన్నారు. అంటే దాదాపు అప్పుల వృద్ధి రేటు సగటున 24 శాతం ఉందన్నారు. అలాంటి దిక్కులేని పరిస్థితుల్లో డిస్కమ్ లు కుప్ప కూలిపోయాయన్నారు. చంద్రబాబు హయాంలో బకాయిలు పెట్టడం, బయట వడ్డీలకు అప్పులు తేవడం, తర్వాత వాటికి చెల్లించకపోవడం జరిగిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో రూ.1,22,518 కోట్లకు పెరిగిందన్నారు. అంటే చంద్రబాబు అప్పులను ఏ విధంగా పెంచుకుంటూ పోయాడో, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు ప్రకారం చూస్తే రూ.36,300 కోట్లు (7.3 శాతం) జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగితే, చంద్రబాబు హయాంలో 24 శాతం అప్పులు పెరిగిన విషయాన్ని గమనించాలన్నారు. 2014కు వచ్చేసరికి డిస్కమ్ ల నికర విలువ రూ.4,315 కోట్లు మైనస్ లో ఉన్నాయన్నారు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో అది మరింత దారుణంగా క్షీణించి వాటి విలువ మైనస్ రూ.20 వేల కోట్లకు పడిపోయిందన్నారు. విద్యుత్ విధానాలు, కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి ఎన్ని అక్రమాలు చేశారంటే ఎక్కడా పారదర్శకత అనేది మచ్చుకైనా కనిపించకుడా చేశారని విమర్శించారు. 

బాబువి అంధకారానికి దారి తీసే నిర్ణయాలు
ప్రపంచ వ్యాప్తంగా సోలార్ విద్యుత్ కు సంబంధించిన రేట్లు తగ్గుముఖం పట్టాయి. కానీ ఆ కంపెనీలతో చంద్రబాబు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడి యూనిట్ కరెంటు దాదాపుగా రూ.7కు కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకున్నారా? లేదా?అని ప్రశ్నించారు. ఇది అంధకారానికి దారి తీసే నిర్ణయమా? వెలుగులు నింపే నిర్ణయమా? చెప్పాలన్నారు. 2014-19 మధ్య 8 వేల మెగా వాట్లకు సంబంధించి దాదాపు ఏటా రూ.3 వేల కోట్ల చొప్పున అధికంగా 25 సంవత్సరాలకు తీసుకున్నారన్నారు. చంద్రబాబు నిర్ణయంతో రూ.75 వేల కోట్లకుపైగా భారాన్ని మోపారన్నారు. పీపీఆర్ విషయంలో కిలోవాట్ విద్యుత్ కు రూ.5.25 నుంచి రూ.5.90 వరకు చెల్లించే విధంగా ఆరోజు ఒప్పందాలు కుదుర్చుకున్నది వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు లాభాన్ని కలిగిస్తాయి కాబట్టి ఒక పథకం ప్రకారం థర్మల్ విద్యుత్ ను తగ్గించడానికి, థర్మల్ విద్యుత్ కంపెనీలను, ఉత్పత్తిని ఉద్దేశపూర్వకంగా తగ్గించిన పరిస్థితి ఉందన్నారు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో 2017లోనే పవన విద్యుత్ కు సంబంధించి యూనిట్ రూ.2.43కు ఒప్పందాలు కుదుర్చుకుంటే చంద్రబాబు ఇంత పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. దాని వెనక ఉన్న ఆంతర్యం స్వార్థ ప్రయోజనమో, రైతుల ప్రయోజనమో, రాష్ట్ర విద్యుత్ వినియోగదారుల ప్రయోజనమో? చంద్రబాబుకు తెలుసన్నారు. కానీ ఈరోజు మళ్లీ దొంగే దొంగ అన్నట్లు ఆయన మాట్లాడుతున్నారన్నారు. 

2004కు ముందు ఉచిత విద్యుత్ అంటే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందే తప్ప ఎక్కడా ఆచరణ సాధ్యంకాదని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.  విద్యుత్ చార్జీల పెంపుపై ప్రశ్నించిన వారిని బషీర్ బాగ్ లో తుపాకీతో కాల్చి చంపిన చరిత్ర బాబుదేనని గుర్తు చేసారు. అలాంటి వ్యక్తి రైతుల మీద, ఉచిత విద్యుత్ మీద ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తున్నాడన్నారు. ఉచిత విద్యుత్ ను వైయస్ రాజశేఖరరెడ్డి గారు తెచ్చారా? చంద్రబాబు తెచ్చారా? అనే అయోమయానికి గురిచేసేట్టుగా బాబు తీరు ఉందన్నారు. 

డిస్కంలు షట్ డౌన్ బాబు పుణ్యమే
థర్మల్ పవర్ కు సంబంధించి చంద్రబాబు బకాయిలు పెట్టి పోతే డిస్కమ్ లు కొన్ని యూనిట్లు షట్ డౌన్ అయిపోయాయన్నారు. రైతులకు సంబంధించిన బకాయిలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తే, వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు డిస్కమ్ లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో బకాయిలు మొత్తం చెల్లించారన్నారు. ఉచిత కరెంటు భవిష్యత్తులో నిరాటంకంగా శాశ్వత ప్రాతిపదికన అందించే లక్ష్యంతో సెకీతో ఒప్పందం కుదుర్చుకుని రూ.2.49కే ఇవ్వడానికి జగన్ మోహన్ రెడ్డి గారు సిద్ధపడ్డారన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి కరెంటు రావాలంటే సెంట్రల్ గ్రిడ్ ను వాడుకోవాలని, అందుకు ఇంటర్ స్టేట్ ట్రాన్స్ మిషన్ చార్జీలు కట్టాలన్నారు. దాన్ని కట్టాల్సిన అవసరం లేదని 2021 జనవరి 15న కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ ఇచ్చిందన్నారు. దీనికి సంబంధించి రూ.62 వేల కోట్లు భారం పడుతుందని చంద్రబాబు అన్నారని, అధికారంలో ఉన్న చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వేవర్ కొనసాగేలా చేస్తే ఈరోజు ఆ భారం మనం భరించే అవసరం ఉండదన్నారు. సెకీతో ఒప్పందాన్ని రద్దు చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని కాకాణి సవాల్ విసిరారు. 
అనేక కష్టనష్టాలకు ఓర్చి, కోవిడ్, ఉక్రెయిన్ వార్ పరిస్థితులు, బొగ్గు దొరకని పరిస్థితులను తట్టుకుని జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమర్థవంతంగా విద్యుత్ ను వినియోగదారులు, రైతులకు అందించారన్నారు. 

విద్యుత్ డిమాండ్ పెరిగింది
ఎండాకాలం విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంటుందని ఆగస్టు నెల వచ్చే సరికి విద్యుత్ వినియోగం తగ్గుతుందన్నారు. దాని ప్రకారమే అంచనాలను తయారు చేసుకున్నామని, వేసవిలో రోజువారీ గ్రిడ్ డిమాండ్ 230 మిలియన్ యూనిట్లు అయితే దాదాపుగా మనం 170-180 మిలియన్ యూనిట్లకు ఆగస్టు వచ్చే సరికి తగ్గిపోతుందనుకున్నామన్నారు. అయితే, ఏ మాత్రం తగ్గకుండా ఈసారి విద్యుత్ వినియోగం రోజుకు దాదాపు 45-50 మిలియన్ యూనిట్లు ఎక్కువగా ఈరోజు వాడకం జరుగుతోందన్నారు. వాటన్నింటినీ అధిగమించి ఎక్కడా రైతులు, వినియోగదారులు ఇబ్బందులు పడకుండా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ట్రూ అప్ చార్జీల గురించి చంద్రబాబు మాట్లాడుతూ, ఇవన్నీ నాకు తెలియవంటూ నంగనాచి మాటలు మాట్లాడాడన్నారు. ట్రూ అప్ చార్జీలు చంద్రబాబే 2014-19 వరకు ఆమోదిత, వాస్తవ పంపిణీ ఖర్చు అని, నిర్వహణకు, తరుగుదలకు, మూలధనానికి సంబంధించిన ప్రతిఫలం.  వీటన్నింటికి సంబంధించి ఆరోజు.. ఏపీఈఆర్సీ ఉత్తర్వుల ప్రకారం ఇవ్వాలని చంద్రబాబు హయాంలో చేసిన నిర్ణయమేనని గుర్తు చేశారు. 

ట్రూ అప్ చార్జీలపై నోరెత్తవేం?
ట్రూ అప్ చార్జీలు ఎత్తేస్తానని మొన్న ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. కానీ, ఈరోజు మీడియా అడిగితే దాన్ని తీసివేస్తాననే మాట మాట్లాడలేదన్నారు. ఇది కూడా మాయ, మోసం చేస్తున్నాడన్నారు. 2014-19 చంద్రబాబు హయాంలో ఏపీఎస్పీడీసీఎల్ కు సంబంధించి రూ.13,255 కోట్లు మాత్రమే సబ్సిడీ రూపంలో ఇవ్వగలిగారన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్య సబ్సిడీకి సంబంధించి రూ.47,800 కోట్ల 92 లక్షలు ఇచ్చారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ బకాయిలు చూస్తే రూ.43,744 కోట్లు జగన్ మోహన్ రెడ్డి గారు చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రైతులకు సంబంధించి మీటర్లు పెట్టకూడదని మాట్లాడారని, ఈరోజు మీడియా వాళ్లు అడిగితే ఎందుకు దాటవేశారని ప్రశ్నించారు. మీటర్లు బిగించడం లేదని స్టేట్ మెంట్ ఇవ్వాలన్నారు. 

ఐదేళ్లలో ఒక్క సారి కూడా పవర్ హాలిడే విధించకుండా మా ప్రభుత్వం సమర్థవంతంగా విద్యుత్ రంగాన్ని నిర్వహిందన్నారు.షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి గతంలో 100 యూనిట్లు ఉంటే మా ప్రభుత్వం వచ్చాక 200 యూనిట్లకు పెంచామన్నారు. బీసీలకు సంబంధించి 100 యూనిట్లు, క్షౌరశాలలకు 150 యూనిట్లు, రజకులకు 150 యూనిట్లు, చేనేతలకు 100 యూనిట్లు, దోబీఘాట్లకు అయితే పూర్తి ఉచితంగా కరెంటు అందించామన్నారు. 2018-19కి ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి మీ ప్రభుత్వం రూ.235 కోట్లు ఖర్చు చేస్తే, 2022-23కు వచ్చే సరికి మేము రూ.637 కోట్లు ఖర్చు చేశామన్నారు. వైజాగ్ లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో విద్యుత్ రంగానికి పెద్దపీట వేసి దాదాపు రూ.9.57 వేల కోట్ల విలువైన ఇంధన రంగానికి సంబంధించి ప్రాజెక్టులకు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 42 అవగాహన ఒప్పందాలు కుదర్చుకుందన్నారు. మాచ్ఖండ్లో ఒడిశా హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఓహెచ్పీసీ), ఏపీ జెన్కో సంయుక్తంగా మాచ్ఖండ్ ప్రాజెక్టు ఎగువ, దిగువ 98 మెగావాట్ల సామర్థ్యం గల మూడు జల విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి ఆ ప్రభుత్వంతో కలిసి ఏర్పరచి అక్కడి నుంచి విద్యుత్ అందిపుచ్చుకోవడానికి చర్యలు తీసుకున్నామన్నారు. అప్పర్ సీలేరులో రూ.11,154 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే 1,350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్లాంట్ (పీఎస్పీ)కు కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ) నుంచి అనుమతిని తీసుకొచ్చామన్నారు. మీ హయాంలో వీటీపీఎస్, కృష్ణపట్నం విద్యుత్ కేంద్రాలను మీరు కాంట్రాక్టులకు కక్కుర్తి పడి వాటిని ప్రారంభించేసి వదిలేసి వెళ్లిపోతే ఆ రెండు ప్రాజెక్టులనూ పూర్తి చేసి జాతికి అంకితం చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు అన్నారు. పిన్నాపురం దగ్గర 5,230 మెగావాట్లకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్ట్ను పెడితే, దానికి సంబంధించి పర్యావరణ అనుమతులు లేవు, అవి లేవు, ఇవి లేవని దాదాపు 3 బిలియన్ డాలర్లు (రూ.24 వేల కోట్లు) పెట్టుబడితో సింగపూర్ ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్, అబుదాబి ఇన్వెస్టిమెంట్ అథారిటీ, ఆరెక్స్ లాంటి ప్రసిద్ధ పెట్టుబడిదారులు వస్తే వాళ్లను ఏ విధంగా తరిమేద్దామా అన్న ఆలోచనతో ఉన్న బాబు  ఆ ప్రాజెక్టు పూర్తి అయితే  జగన్ మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందేమోన్న ఆలోచనతో ఉన్నారన్నారు. 

అన్ని వర్గాలకూ ఊరటనిచ్చిన వైయస్ జగన్ గారి సంస్కరణలు
చంద్రబాబులా అప్పులు చేయకుండా, థర్మల్ విద్యుత్ ను తగ్గించకుండా, విద్యుత్ రంగానికి ఈరోజు ఊతం ఇస్తూ, కరెంటు వినియోగాన్ని పెంచుకుంటూ, అవసరమైన వాళ్లకు కరెంటు కనెక్షన్లు ఇస్తూ, డిమాండ్ పెరిగినా దాన్ని భరించి ఈరోజు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు విద్యుత్ రంగంలో అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ఈరోజు అన్ని వర్గాలు, రైతులకు, ప్రజలకు ఊరటగా నిలిచాయన్నారు. 

Back to Top