వరదల దాటికి ప్రతి ఇంటిలోనూ కొన్ని లక్షల ఆస్థి నష్టం  

మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు  

ప్రభుత్వం పూర్తి భాద్యత వహించి ప్రజలకు నష్ట పరిహారం చెల్లించాలి: వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండు

విజ‌య‌వాడ‌: వరదల దాటికి విజ‌య‌వాడ న‌గ‌రంలోని ప్రతి ఇంటిలోనూ కొన్ని లక్షల రూపాయల ఆస్థి నష్టం జరిగిందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు  పేర్కొన్నారు. విజ‌య‌వాడ‌ 43వ డివిజన్ ఊర్మిళ నగర్ ప్రాంతంలో మంగళవారం  మాజీ మంత్రి , విజయవాడ పశ్చిమ మాజీ శాసన సభ్యులు, ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ  అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు స్థానిక డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటి రెడ్డి, శాసన మండలి సభ్యులు ఎండీ రుహుల్లాతో కలిసి వరద ముంపుకు గురైన ప్రాంతంలో పర్యటిస్తు ప్రజల యోగ క్షేమాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థుల సర్టిఫికెట్లు, పుస్తకాలు పూర్తిగా వరద నీటికి తడిసిపోయాయి, విద్యార్థులకు పుస్తకాలు, సర్టిఫికెట్లు మరల జారీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల‌ని వెలంపల్లి శ్రీనివాసరావు ప్ర‌భుత్వాన్ని కోరారు.

నిత్యావసర సరుకుల కోసం ప్రజలు రోడ్ ల మీద పడిగాపులు కాస్తు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు, ప్రభుత్వం  నిత్యావసర సరుకులను ఇంటివద్దకు అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వరద ముంపుకు గురైన ప్రాంతాలలో శానిటేషన్ చేయడంలో అధికారులు, ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందింది . నగర కమిషనర్ ధ్యాన చంద్ర తో ఫోన్ లో సంభాషించి ఇప్పటికి రోడ్ల మీద, ఇళ్లలోనూ వరద నీళ్లు నిలిచిపోయాయని, వెంటనే మోటార్లు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతం లో నిలిచిన పోయిన నీళ్లను తొలగించాలని ప్రజలకు విషజ్వరాలు, అంటురోగాలు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవలని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కోరారు.

ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వరదల దాటికి ప్రతి ఇంటిలోనూ కొన్ని లక్షల రూపాయల ఆస్థి నష్టం జరిగిందని ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి ప్రజలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లు, పుస్తకాలు పూర్తిగా వరద నీటికి తడిసిపోయాయని ప్రభుత్వం వాటి మీద కూడా ద్రుష్టి సారించి విద్యార్థులకు పుస్తకాలు, మరియు సర్టిఫికెట్లు మరల జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నిత్యావసర సరుకుల కోసం ప్రజలు రోడ్ ల మీద పడిగాపులు కాస్తున్నారని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారని ప్రజలకు నిత్యావసర సరుకులను ఇంటివద్దకు అందించే విధంగా ప్రభత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్నికి విజ్ఞప్తి చేసారు. వరద ముంపుకు గురైన ప్రాంతాలలో శానిటేషన్ చేయడంలో అధికారులు, ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని వరద నీళ్లు ఇప్పటికి రోడ్ల మీద ఇళ్లలోనూ నిలిచిపోయాయని వెంటనే మోటార్లు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతం లో నిలిచిన పోయిన నీళ్లను తొలగించి ప్రజలకు విషజ్వరాలు, అంటురోగాలు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవలసిందిగా నగర కమిషనర్ ధ్యాన చంద్ర తో ఫోన్ లో సంభాషించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు కోరారు.

Back to Top