వైయ‌స్ఆర్‌సీపీ యూత్ లీడ‌ర్ సాకేష్‌పై దాడి అమానుషం

మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి

సాకేష్‌కు కాకాణి, పర్వతరెడ్డిల పరామర్శ

నెల్లూరు జిల్లా: నెల్లూరు నగర వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుడు సాకేష్ పై తెలుగుదేశం పార్టీకి చెందిన గూండాలు దాడికి పాల్ప‌డ‌టం అమానుష‌మ‌ని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడు కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. దాడి విష‌యం తెలిసిన వెంట‌నే నెల్లూరు నగరం, బాలాజీ నగర్ లో నివసిస్తున్న సాకేష్ ఇంటికి శాసనమండలి సభ్యులు, నెల్లూరు నగర నియోజకవర్గ సమన్వయకర్త పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కాకాణి వెళ్లి పరామర్శించారు. గాయాలను పరిశీలించి, దాడి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం వారు మీడియాతో మాట్లాడారు.

కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఏమ‌న్నారంటే..

  • నెల్లూరు నగరానికి చెందిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు "సాకేష్" పై జరిగిన దాడి అమానుషం.
  •  సాకేష్ ను గత కొద్దిరోజులుగా వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీని వీడి, తెలుగుదేశం పార్టీలోకి రావాలంటూ ఒత్తిడి చేస్తున్న తెలుగుదేశం పార్టీనేతలు.
  •  సాకేష్  గత ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గంలో చురుకుగా పనిచేయడంతో, "సాకేష్" ను ఎలాగైనా తెలుగుదేశం పార్టీలోకి తీసుకు వెళ్లేందుకు ప్రారంభమైన బెదిరింపుల పర్వం.
  • తెలుగుదేశం పార్టీ నేతలకు సాకేష్ తలొగ్గకపోవడంతో, దాడికి తెగబడటం అత్యంత హేయమైన చర్య.
  • కొడవలూరు మండలంలో తన  పొలంలోకి వెళ్లిన "సాకేష్" ను మంత్రి నారాయణ అనుచరులు గన్నవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వారిని కొందరిని ఉసిగొల్పి, విచక్షణారహితంగా దాడి చేయడం సహించరాని నేరం.
  •  సాకేష్ పై జరిగిన దాడిలో ఒంటినిండా గాయాలతో పాటు, తలపై తగిలిన గాయానికి 15 కుట్లు పడి, కుడి చెయ్యి రెండు చోట్ల విరిగితే, కేవలం మొక్కుబడిగా 324 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం చూస్తుంటే, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఎంత అధ్వాన్నంగా తయారైందో! తెలుస్తుంది.
  • కొడవలూరు ఇన్స్ పెక్టర్ సురేంద్ర దగ్గరకు వెళ్లి, తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తమపై దాడికి పాల్పడే అవకాశం ఉందని "సాకేష్" బంధువులు ఆశ్రయిస్తే,  "తెలుగుదేశం పార్టీలోకి చేరకపోతే, మీకు కష్టాలు తప్పవు" అంటూ హెచ్చరించి, బూతులు తిట్టిన ఇన్స్ పెక్టర్ సురేంద్ర పై విచారణ జరిపి జిల్లా ఎస్పీ గారు తక్షణమే చర్యలు తీసుకోవల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.
  •  సాకేష్ పై దాడి ఘటన తదనంతరం పోలీసులు వ్యవహరించిన తీరు జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకుని వెళ్తాం... జిల్లా ఎస్పీ గారు న్యాయం చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి, ప్రైవేట్ కేసులు వేస్తాం..
  • మంత్రిగా ఉన్న నారాయణ గారు జరిగిన సంఘటనలపై నిజ నిజాలు తెలుసుకొని, కారుకులైన వారిని కఠినంగా శిక్షించేందుకు చర్యలు చేపట్టి, తన నిజాయితీని నిరూపించుకోవాలి.
  • నిన్నటిదాకా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది... మరలా రేపు తిరిగి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, దాడులు చేసే వారిని, దాడులు చేసే వారికి మద్దతుగా నిలుస్తున్న  పోలీసు అధికారులను విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు.
  • అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసు శాఖ గుర్తెరిగి పనిచేస్తే మంచిది.
  • సాకేష్ కు నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా అండగా నిలుస్తుంది.
  • నెల్లూరు నగరంలో ప్రజలకు దాడులను ప్రోత్సహించే సంస్కృతి లేదు.
  • తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇదే!, చివరి అవకాశంగా భావిస్తున్నారేమో! తెలియదు కానీ, చేయకూడనటువంటి నీచమైన పనులకు పాల్పడుతున్నారు.
  • కూటమి ప్రభుత్వంలో ప్రజల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.
  • ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి, భయభ్రాంతులకు గురి చేసే సంస్కృతిని తీసుకొచ్చారు.
  • సాకేష్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం..సాకేష్ కు న్యాయం జరిగే వరకు పోరాడుతాం...

ప‌ర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్:

  • మంత్రి నారాయణ ఇలాకాలో దాడులు జరగడం అన్యాయం.
  • సాకేష్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
  • ఘటన జరిగిన వెంటనే, సాకేష్ దగ్గరకు వెళ్లి, సాకేష్ పరిస్థితి చూస్తే బాధ కలిగింది.
  • జిల్లా ఎస్పీ  వెంటనే జోక్యం చేసుకొని సాకేష్ కు న్యాయం చేయాలి.
  • నెల్లూరు నగరంలో యువజన విభాగంలో అత్యంత కీలక వ్యక్తిగా ఎదగడంతో తెలుగుదేశం పార్టీ దృష్టి  సాకేష్ పై పడింది.
  • సాకేష్ బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగక పోవడంతో దాడికి పూనుకున్నారు.
  • సాకేష్ విషయంలో పోలీసులు కేసు నీరుగార్చే ప్రయత్నం చేయడం సరికాదు.
  • సాకేష్ కు అందరం అన్ని విధాలా అండగా నిలుస్తాం.
Back to Top