అసెంబ్లీ: తమను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలే కృష్ణుల్లాగా ముందుకు నడిపిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పేర్ని నాని మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ ఫొటో పెట్టుకొని బాలశౌరి ఎంపీగా గెలిచాడని, ఇప్పుడు పార్టీ మారి సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. జంపింగ్ జపాంగ్‌ని వీరుడిలా పవన్ భావిస్తున్నాడని, కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత పవన్ కి లేదన్నారు. శత్రువులతో షర్మిల చేతులు కలిపి, బజారుకెక్కి సొంత అన్ననే దూషిస్తున్నారని, సీఎం అనుచరులు చూస్తూ ఊరుకొంటారా..? అని ప్రశ్నించారు. తల్లిని తిట్టిన వాళ్ళ పల్లకీ మోసే పవన్‌ని ఏమనాలని పేర్ని నాని ప్రశ్నించారు. జరగబోయే కురుక్షేత్రంలో పవన్ ది శల్యుడి పాత్ర అని ఎద్దేవా చేశారు. పవన్‌ని సీఎంగా చూడాలన్న కార్యకర్త స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాడని, చంద్రబాబు రిజెక్ట్ చేసి బాలశౌరిని పవన్ పక్కకు పంపాడన్నారు. నాదెండ్ల మనోహర్ కాళ్ళు పట్టుకొని బాలశౌరి జనసేనలో దూరారని దుయ్యబట్టారు. ఆశ్రయం, అధికారం, అర్హత కల్పించిన సీఎం వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత బాలశౌరికి లేదన్నారు. శక్తులన్నీ ఏకమై కౌరవుల్లా వచ్చినా వైయస్ జగన్ లాంటి అర్జునుడిని ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. కాపు కులాన్ని పణంగా పెట్టి చంద్రబాబు పల్లకీ మోయవద్దు అని హరిరామ జోగయ్య కూడా లేఖ రాశారని గుర్తుచేశారు. హుందాగా వ్యవహరించాలని పవన్ కి సూచించారు. కమ్మలు, రెడ్లు లాగే అధికారం కోసం పోరాడామని లేఖలో కోరారు. వ్యక్తిత్వ హననం చేస్తూ సీఎం వైయస్ జగన్‌ని మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తనను సర్వర్‌లా చంద్రబాబు అభివర్ణించాడని, పెత్తందారీ చంద్రబాబుకి సర్వర్లంటే అంత చిన్నచూపా అని పేర్ని నాని ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీమంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ఏమన్నారంటే... బంధాల గురించి పవన్ మాట్లాడటమా..? జగన్ గారి ప్రభుత్వం వల్ల మేలు జరిగిన ప్రతి కుటుంబం, ప్రతి వైయస్ఆర్సీపీ కార్యకర్త శ్రీకృష్ణుడిలా తనకు అండగా ఉండి నడిపించమని కోరుతుంటే... రేపు జరిగే కురుక్షేత్రంలో కుట్రలు, కుతంత్రాలతో కూటములు కట్టి మందిగా వస్తున్న కౌరవులను మట్టికరిపించడానికి ప్రజలు సిద్ధమయ్యారు. అర్జునుడు అయితే ద్రౌపదిని కాపాడాలంటాడు.. అర్జునుడు, ద్రౌపది సంబంధం కూడా తెలియదు. కుటుంబబంధాలు, మానవసంబంధాలు గురించి కుటుంబం జీవితం గురించి పవన్ కల్యాణ్ దగ్గర నేర్చుకోవడం కంటే హాస్యాస్పదం ఏముంది? -చిరంజీవి గారికి తోడపుట్టి ఆయనను ఎంతగా అవమానించారు మీరు. చంద్రబాబుకు, మోడీకి ఓట్లు వేయండి, కాంగ్రెస్ పార్టీని నాశనం చేయండని నీవు మాట్లాడితే చిరంజీవిగారు ఏం చేయలేకపోయారు. చిరంజీవి తలదించుకునేలా వ్యవహరించిన మీరు బంధాల గురించి మాట్లాడుతున్నారు. అన్నతో విభేదించి అన్నగారు శత్రువులతో చేతులు కలిపి విమర్శిస్తున్నారు . పదేళ్ళ క్రిత నా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు, అన్యాయంగా మాపై కేసులు పెట్టి బజారుపాలు చేస్తున్నారని మాట్లాడి ఇవాళ అదే జెండా మోస్తూ విమర్శిస్తున్నారు. అన్నని దూషిస్తున్నప్పుడు అన్న సైన్యం ఏం చేస్తారు? జనసైకోలు చిరంజీవిని దూషించినప్పుడు పవన్ కల్యాణ్ నోరు ఏమైంది.. ఇవాళ సన్నాయి నొక్కులు, పత్తిత్తికబుర్లు చెబుతున్నాడు. నా తల్లిని దూషిస్తారా అని టీడీపీని, లోకేష్ ను, చంద్రబాబుపై గతంలో పవన్ కల్యాణ్ రంకెలేశారు . సిగ్గు, శరం ఉన్నవాడు ఎవరైనా తల్లి, తండ్రి, చెల్లి, భార్య అనే బంధాలకు విలువిచ్చేవాడవైతే తల్లిని తిట్టిన వాడిని ఏం చేస్తారు.. చేతనైతే వాడి పాడె మోస్తారు, లేదంటే దుర్మార్గంగా నేను మేలు చేస్తే నా తల్లిని తిట్టి అవమానించారు వాడిని శిక్షించు అని కోరుకుంటారు, కానీ పవన్ కల్యాణ్ తల్లిని తిట్టినవారి పల్లకి మోస్తున్నారు. కలియుగ శల్యుడు పవన్ః తల్లిని తిట్టినవాళ్ల పల్లకి మోసే వారిని, నువ్వు సీఎం అవ్వాలి మా ప్రాణం పెడతామని.. అని నీకోసం వీరంగం వేస్తున్న మీవాళ్లందరిని కూడా "మనకు అంత సీన్ లేదు మనం పల్లకి మోయడమే, నేను సీఎం కాలేను, ఎమ్మెల్యేను అవ్వలేను మీరు ఆగండని.." వారి స్థైర్యాన్ని చంపేవారిని యుద్ధానికి సిద్ధమైన జనసేన కార్యకర్తల మానసిక స్థైర్యాన్ని చంపే వాడిని శల్యుడు అంటారు కలియుగ భారతంలో శల్యుడు పాత్ర పవన్ కల్యాణ్ పోషిస్తున్నాడు. నాడు కర్ణుడు ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిన వాడు శల్యుడు. నేడు మీ పార్టీ కార్యకర్తల స్థైర్యాన్ని మన చేతిలో ఆయుధాలు కాదు, పల్లకీ పట్టి ఉండాలి, పల్లకీ మోయాలి అని చెప్తున్న నువ్వు కలియుగ శల్యుడివి. నువ్వు శల్యుడికి కాబట్టే జగన్ గారు అర్జునుడు అంటే బాధ కలిగి మాట్లాడుతున్నావు. జంపింగ్ జపాంగ్ బాలశౌరిః జగన్ గారు అసత్యలు, అబద్దాలు మాట్లాడతాడని జంపింగ్ జపాంగ్ బాలశౌరి నోటికొచ్చినట్లు మాట్లాడాడు . 2004 నుంచి 2009 వరకు 2019 నుంచి 2024 నాకు జగన్ గారి గురించి మొత్తం తెలుసని అన్నావ్. అంత తెలిసినవాడివి జగన్ గారి దగ్గరకు ఎందుకు వచ్చావు. సిగ్గుశరం లేదా? 2014లో జగన్ గారి సింబల్ మీద ఆయన ఫోటో పెట్టుకుని గుంటూరులో ఓట్లు ఎందుకు అడుక్కున్నావు. 2019లో వైయస్ఆర్ సీపీ సింబల్ మీద బందరులో ఎందుకు పోటీ చేశావు? అన్నీ తెలిసి రావడానికి సిగ్గుండాలిగా? మా బందరు ఎంపీ గారు.. దేనికి సిద్ధం? పారిపోవడానికి సిద్ధమా? పారిపోయే బతుకులు ఎవరివి? 2004 మన బతుకు ఎక్కడ? తెనాలి, తెనాలి నుంచి 2009 లో నరసరావుపేటకు పారిపోయింది ఎవరు? 2014లో గుంటూరుకు పారిపోయింది ఎవరు? 2019లో గుంటూరు నుంచి బందరుకు పారిపోయింది ఎవరు? పారిపోయే బతుకులు ఎవరివి? నాడు రాజశేఖర్ రెడ్డ గారు లేకపోతే నీకు బతుకు లేదు? చనిపోయిన రాజశేఖర్ రెడ్డి గారి గురించి, కేవీపీ రామచంద్రరావు గురించి సాయంత్రం 8తర్వాత ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నావో కేవీపీకి తెలియదు అనుకుంటున్నావా? ఎంత అసహ్యంగా, జుగుప్సాకరంగా జగన్ గారి గురించి ఏం మాట్లాడావో, ఏం మాట్లాడుతున్నావో తెలియదు అనుకుంటున్నావా? పవన్ కల్యాణ్ గురించి ఏం మాట్లాడావో తెలియదా? బాలశౌరీది డేంజర్ స్కూల్ః 2023 జనవరి, ఫిబ్రవరిలో చంద్రబాబు దగ్గరకు నీవు కబురు చేస్తే ఇది మన స్కూల్ కాదు, ఇది చాలా డేంజర్ కేసు మనకు వద్దు పవన్ కల్యాణ్ దగ్గరకు తోసేయండి అని చెప్తే మార్చి, ఏప్రిల్ లో పవన్ కల్యాణ్ దగ్గరకు ఒక ప్రొడ్యూసర్ తో హరీష్ శంకర్ మైత్రీ మూవీస్ సినిమా షూటింగ్ జరుగుతుంటే అక్కడకు కబురు చేసిన మాట వాస్తవం అవునా? కాదా? పవన్ కల్యాణ్ ఛీ కొట్టిన మాట వాస్తవం అవునా? కాదా? తర్వాత చిరంజీవి కాళ్ళు పట్టుకుంటే.. చిరంజీవిగారితో పవన్ కల్యాణ్ కు ఫోన్ చేయించి జూన్, జులైలో పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్ళిన మాట వాస్తవం అవునా? కాదా? -2004-09 కాలంలో... పవన్ కల్యాణ్ పక్కన కూర్చునే నాదెండ్ల మనోహర్ ని నీవు ఎంత ఏడిపించావు? ఎంత కాల్చుకుతిన్నావు? నాదెండ్లను బజారుకీడ్చి రచ్చ రచ్చ చేశావు? చిరంజీవి నాదెండ్ల మనోహర్ కు ఫోన్ చేసి, బాలశౌరి వస్తాడు క్షమించమని చెప్తే మనోహర్ క్షమించాడు ... నాదెండ్ల మనోహర్ కాళ్ళు పట్టుకుంటే కదా ఆయన కరిగి నిన్ను క్షమించింది ఇన్ని సర్కస్ లు , పిల్లి మొగ్గలు వేసి ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నావు. -బందరు పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలతో తగువులేని నియోజకవర్గం లేదు బందరులో కాపులు ఎక్కువున్నారు ఇక్కడైతే ఇబ్బంది అవుతుందని వెళ్ళిపోవచ్చు తప్పులేదు, రాజకీయాల కోసం గోడలు దూకుతున్నారు, పార్టీలు మారుతున్నారు.. ఇది కలియుగం. పదవుల కోసం గడ్డి కరుస్తున్నారు. కానీ అటువైపు వెళ్ళి ఇలా మాట్లాడడం సరికాదు. సిగ్గుశరం ఉన్నవాళ్ళైతే నాదెండ్ల మనోహర్ కాళ్ళు పట్టుకుంటావా? నాదెండ్లను, ఆయన శ్రీమతిని ఎన్ని దుర్భాషలాడి కాళ్లుప్టటుకునే పరిస్థితి. గోడలు దూకేవాడికి దేవుడు మేలు చేస్తాడా? జగన్ గారి ఏం పుట్టుమచ్చలు నీకు తెలుసు... అన్నీ తెలిసినవాడివే అయితే వైయస్ఆర్సీపీ తరఫున రెండు సార్లు ఎందుకు పోటీ చేయాలి? పవన్ కల్యాణ్ కు బాలశౌరి నిజస్వరూపం త్వరలోనే తెలుస్తుంది. రాజధాని ఇక్కడే ఉంచుతామని ఊరూరు తిరిగాడంటావా? అసలు ఏడు నియోజవకర్గాల్లో ఎన్ని ఊళ్ళు ఉన్నాయో చెప్పగలవా? ఏ ఊరిలో సర్పంచ్ ఎవరు, ఎంపీటీసీ ఎవరు? బందరులో కార్పొరేటర్ ఎవరు? ఎవరినైనా ఓటు అడిగామా? ఆశ్రయం ఇచ్చి , అర్హత, అధికారం ఇచ్చిన వారిని కించపరుస్తూ మాట్లాడటం మంచిదికాదు. నీలాంటి వాడికి దేవుడుంటాడా?, గోడలు దూకినవాడికి, వెన్నుపోట్లు పొడిచినవాడికి ఇంతమందిని మోసం చేసినవాడికి దేవుడుంటాడా?. తెనాలిలో, నరసరావుపేటలో, గుంటూరులో, బందరులో ఎంక్వాయిరీ చేస్తే తెలుస్తుంది ఎవరు ఏంటో? మీరు మాట్లేడే భాష సూక్తులు ఏంటి... తల్లిని దూషించిన పార్టీ పల్లకీ మోస్తున్న మీరు, శత్రువులతో చేతులు కలిపి అన్నని దూషిస్తున్న షర్మిల గారు మీ ఇద్దరు కలిసి ఈరోజు అర్జునుడు అంటే తప్పుపట్టే పరిస్థితి.. ఈ కలియుగంలో కూడా చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ , సీపీఐ పార్టీలు జగన్ గారిని వ్యతిరేకించే శక్తులన్నీ కలియుగ కౌరవులుగా జగన్ గారి మీద దాడి చేస్తున్నారు ఇది పెత్తందారులకు పేదలకి మధ్య జరగబోతున్న కలియుగ యుద్దంలో జగన్ గారిది అర్జునుడు పాత్ర, ప్రజలది, వైయస్ఆర్సీపీది వారధి శ్రీకృష్ణుడు పాత్ర. -కాపుల్ని మోసం చేయొద్దు, వారు అమాయకులు అని హరిరామజోగయ్య మాట్లాడుతున్నారు అది ఆయన గోల, ఇది వైయస్ఆర్సీపీకు సంబంధించిన గోల కాదు. కులపరంగా మాట్లాడుతున్నారు, కాపుల్ని పోగేసి చంద్రబాబుకు తాకట్టుపెట్టొద్దు, చంద్రబాబు పల్లకీ మోయొద్దు, మన కులానికి కూడా సీఎం ఉండాలని హరిరామజోగయ్య ఆకాంక్షిస్తున్నట్టు ఉన్నాడు, ఆ ఆకాంక్షను ఒప్పుకుంటాడా లేదా.? పల్లకి మోయడమే నాకు అలవాటైనా వ్యవహారం అనేది వాళ్ళిద్దరూ చూసుకోవాల్సిన వ్యవహారం. బాబుది పెత్తందారీ మనస్తత్వంః మా కార్యకర్తలకు భోజనం పెడితే సర్వర్ ఉద్యోగమా? కార్యకర్తలకు అన్నం పెడతామంటే సర్వరా? కార్యకర్తలంటే ఎంత విలువ ఉంది మీకు? ఎంత పెత్తందారీ మనస్తత్వం? మీరు చౌదిరివి అని, ఎన్టీఆర్ అల్లుడివి అని, ఖర్జూరనాయుడు కొడుకువి అని మీ పెత్తందారీ మనస్తత్వం ప్రదర్శిస్తారా? సర్వర్ లు అంటే చిన్నవాళ్ళా? వారి ఓట్లు కావాలి.. వాళ్లు మనుషులు కాదా? వారికి కుటుంబాలు లేవా? వారికి వ్యక్తిత్తం లేదా? ఒళ్ళు వంచి కష్టపడి సర్వర్ అయితే తప్పేంటి? పెత్తందారీ మనస్తత్వం, బూర్జువా మనస్తత్వం, కులహంకారంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. అందుకే జగన్ గారు చెప్తున్నారు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి పెత్తందారులు పేదలకు వ్యతిరేకం. ఇటువంటి పెత్తందారులకు వ్యతిరేకంగా మన పోరాటం అని జగన్ గారు అంటున్నారు. చిన్న ఉద్యోగస్తులు... వర్కర్లు, సర్వర్లు అంటే చంద్రబాబుకు చిన్నచూపు. చంద్రబాబు దృష్టిలో వారికి అసలు విలువే లేదు. అందుకే ఇటువంటి పెత్తందారీ మనస్తత్వం ఉన్న చంద్రబాబుకు రేపు జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో కాల్చివాతపెట్టాలి.