వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు

ఉరవకొండ మండల వ్యవసాయ సలహా మండలి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

ఉరవకొండ:   వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ మూడున్నరేళ్లలో వ్యసాయం రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకువ‌చ్చారని ఉరవకొండ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఎన్నడూలేని రీతిలో రైతులకు అనేక విధాలుగా సాయం అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఉరవకొండ మండల వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని స్థానిక మండల కార్యాలయ సమావేశ హాల్లో నిర్వహించారు.  ఈ సందర్భంగా విశ్వేశ్వ‌ర‌రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో వ్యవసాయ సమస్యలు పరిష్కరించడం కోసమే ప్రతి నెలా వ్యవసాయ సలహా మండలి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.రైతుల సమస్యల పరిష్కారానికి, సూచనలు తెలియజేయటానికి వ్యవసాయ సలహా మండలి సమావేశాలు ఉపయోగపడతాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఏర్పాటుచేసిన 'వైయస్సార్ రైతు భరోసా కేంద్రాలు' ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.రాష్ట్రలో ఆర్బికేలు ఏర్పాటు ద్వారా సీఎం జగన్ విప్లవత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. రైతులు ముంగిటికే ఎరువులు.. విత్తనాలు అందివడంతో పాటు అనేక సలహాలు, సూచనలు అందిస్తూ, ఈక్రాప్ నమోదు చేస్తూ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు.ఇంతకముందు ఇన్సూరెన్స్‌ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని అసలు వస్తుందో రాదో ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఈ రోజు ఒక సీజన్‌లో నష్టం జరిగితే మరలా మరుసటి ఏడాది అదే సీజన్‌ రాకమునుపే ఇన్సూరెన్స్‌ సొమ్ము నేరుగా మీ చేతుల్లోకి వచ్చే గొప్ప మార్పును జగన్ తెచ్చాడన్నారు.ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇన్సూరెన్స్ విధానంతో గత ఏడాది ఒక్క ఉరవకొండ నియోజవర్గం రైతులకే 100 కోట్ల రూపాయలు మేర లబ్ది చేకూరిందన్నారు. అదేవిధంగా పంటలు పండించే ఏ రైతన్న తన పంటను అమ్ముకునే విషయంలో నష్టపోకూడదని రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారన్నారు.ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే.. తోడుగా నిలబడేందుకు మరో రూ.2వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాలనిధిని కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. గతంలో రైతు ఆత్మహత్యలను అప్పటి ప్రభుత్వం గుర్తించేది కాదని...కానీ వైయ‌స్ జగన్ సీఎం అయిన వెంటనే ఆత్మహత్యలు నివారణకు అనేక చర్యలు చేపట్టారన్నారు.గతంతో పోలిస్తే ఇప్పుడు ఆత్మహత్యలు తగ్గాయన్నారు. అయినప్పటికీ దురదృష్టవశాత్తూ రైతన్నలు ఎవరైనా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు కనిపిస్తే ఆ ఆత్మహత్య రైతన్నలు చేసుకోలేదని చెప్పే పరిస్థితి నేడు లేదన్నారు. వ్యవసాయం లో అప్పులు కారణంగా రైతన్న ఆత్మహత్య చేసుకుంటే రూ.7 లక్షల పరిహారం అందజేస్తూ వారి కుటుంబాన్ని ఆదుకుంటున్నామని తెలిపారు. ఇలా అనేక విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవలను రైతుల చెంతకు చేర్చాల్సిన బాధ్యత వ్యవసాయ ఉద్యోగులు, ఆర్బికే సిబ్బంది, వ్యవసాయ సలహా మండలి సభ్యులు తీసుకోవాలని అందరూ కలిసి సమన్వయంతో పని చేస్తే రైతులకు మంచి చేయాలన్న ముఖ్యమంత్రి లక్ష్యం పూర్తిగా నెరవేరుతుందన్నారు.  

Back to Top