ఏంటి ఈ జన ప్రవాహం అనిపిస్తోంది 

మంత్రి అంబ‌టి రాంబాబు

బాప‌ట్ల‌:  బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద చివరి సిద్ధం సభ గురించి మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. చివరి సిద్ధం సభ సూపర్ సక్సెస్ అయ్యింద‌ని చెప్పారు. ఆకాశం బద్ధలైందా.. నేల ఈనిందా అన్నట్టుగా ఉంది  ఇక్కడ జనసంద్రాన్ని చూస్తే ..ఏంటి ఈ జన ప్రవాహం అనిపిస్తోంది. 15 లక్షలకు మించి ప్రజలు హాజరవుతారన్నారు. ఈ సభ మాకు ఎన్నికల ప్రచారం లాంటిదన్నారు. గత సభలకు మించి ప్రజల స్పందన ఉందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు మేము ఊహించిందేనని మంత్రి వ్యాఖ్యానించారు. ఏపీలో 90 శాతం మందికి పైగా ప్రభుత్వ పథకాలు అందాయన్నారు. అందరూ కలిసినా మాకేం కాదన్నారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కాపులందరూ ఎదురు చూశారని.. పవన్ మాత్రం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నాడు.. ఇది అందరూ గమనించారన్నారు. 

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. ప్రజలు సీఎం వైయ‌స్ జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యారన్నారు. 50 శాతానికి పైగా ప్రజలు వైయ‌స్ జగన్ వెంట ఉంటే.. ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా మాకు నష్టం లేదన్నారు. రానున్న ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేస్తారని భావిస్తున్నామన్నారు. మేము కూడా ఆయన మాటల కోసం ఎదురు చూస్తున్నామన్నారు.  

Back to Top