విజయవాడ: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి.. ఆ ఫలాలన్నీ రాష్ట్ర ప్రజలందరికీ అందాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చారని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నం పరిపాలనా రాజధాని అయితే వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. మూడు రాజధానులతో రాష్ట్రంలోని 26 జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా రాజధానుల ఏర్పాటు ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.