నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రబ్బర్‌స్టాంప్‌ మాత్రమే

రమేష్‌కుమార్‌ వెనుక బాబు, రామోజీ, రాధాకృష్ణ

ఎస్ఈసీ వైఖ‌రిపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజం

కృష్ణా: నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాజ్యాంగ పదవిలో ఉన్నానని మర్చిపోయి చంద్రబాబుకు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. నిన్న గవర్నర్‌కు ఇచ్చిన లేఖ టీడీపీ ఆఫీస్, రాధాకృష్ణ నుంచి వచ్చినట్లు సమాచారాలు వస్తున్నాయన్నారు. నిమ్మగడ్డ రబ్బర్‌ స్టాంప్‌ మాత్రమేనని ఎద్దేవా చేశారు. మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. రమేష్‌కుమార్‌ వెనుక చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ ఉన్నారని ఆరోపించారు. సీఆర్‌డీఏ బిల్లు రద్దుపై గవర్నర్‌ ఆర్డినెన్స్‌ చెల్లదంటూ గవర్నర్‌ను దూషించిన చంద్రబాబుపై చర్యలు తీసుకుంటే ప్రతిపక్ష హోదా ఉండేది కాదన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తుల పట్ల తనకు ఎల్లప్పుడూ గౌరవం ఉంటుందన్నారు. 

 

Back to Top