పవన్‌ కళ్యాణ్‌ క‌ళ్లున్న‌ కబోదిలా వ్యవహరిస్తున్నారు

మంత్రి మేరుగు నాగార్జున ఫైర్‌

విశాఖ:. పవన్‌ కళ్యాణ్‌  క‌ళ్లున్న‌ కబోదిలా వ్యవహరిస్తున్నారని మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. విశాఖలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చారిత్రక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 54 వేల ఎకరాల భూమిని బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయించారని చెప్పారు. వలంటీర్లు తమ ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేస్తున్నారని పేర్కొన్నారు.  విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని అడిగిన రైతులను చంద్రబాబు పిట్టల్లా కల్పించారని గుర్తు చేశారు.

Back to Top