మంగళగిరి: కరోనా కట్టడి చర్యలపై మంత్రుల పర్యవేక్షణ కమిటీ భేటీ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో ఈ భేటీ జరుగుతుంది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మేకతోటి సుచరిత, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్, కమాండ్ కంట్రోల్ నిర్వహణపై సమీక్షించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలపై చర్చించనున్నారు.