ఎన్‌టీఏలో త‌క్ష‌ణ సంస్క‌ర‌ణ‌లు అవ‌స‌రం

లోక్‌స‌భ‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మ‌ద్దిల గురుమూర్తి

న్యూఢిల్లీ:  జాతీయ పరీక్షా సంస్థలో (ఎన్.టి.ఏ) తక్షణ సంస్కరణలు అవసరమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అభిప్రాయ‌ప‌డ్డారు. దేశంలో వైద్య విద్యను అభ్యసించేందుకు సుమారు 2.4 కోట్ల మంది విద్యార్థులు "నీట్" ద్వారా పోటీ పడుతుండగా ఈ ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యత జాతీయ పరీక్షా సంస్థ (ఎన్.టి.ఏ)పై ఉంద‌న్నారు.   ఇటీవల జరిగిన “నీట్” ప్రవేశ పరీక్షలో అవకతవకలు, ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాలు పరీక్ష కంటే ముందు బహిర్గతం అయ్యాయి ఇలాంటి ఆరోపణలతో ఆ ప్రవేశ పరీక్ష రద్దు చేయడం. అలాగే యూజీసీ-నెట్ పరీక్ష కూడా రద్దు కావడంతో పలు ఆందోళనలను రేకెత్తిస్తుంద‌న్నారు. ఈ పరిణామాలు సంవత్సరాల తరబడి ఈ ప్రవేశ పరీక్ష కోసం కఠినమైన అభ్యసనా, విలువైన సమయం, పెట్టుబడిగా పెట్టిన అసంఖ్యాక విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని అలాగే జాతీయ పరీక్షా సంస్థ (ఎన్.టి.ఏ) లోని వ్యవస్థాగత సమస్యలను హైలైట్ చేస్తుందని లోక్‌ సభ ద్వారా `తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

ఇలా పదేపదే జరుగుతున్న వైఫల్యాల వలన ఏర్పడిన అనిశ్చితితో సురక్షితమైన , విశ్వసనీయమైన ప్రవేశ పరీక్ష విధానాన్ని అందించగల జాతీయ పరీక్షా సంస్థ (ఎన్.టి.ఏ) సామర్థ్యంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని వైద్య విద్యను అభ్యసించాలి అనుకుంటున్నా ఆశావహుల విశ్వాసం కోల్పోకుండా నిరోధించడానికి, ప్రభుత్వం అత్యవసరంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గురుమూర్తి కోరారు.

ఇందు కోసం ద్విముఖ విధానం కీలకమని అనగా అక్రమాలపై స్వతంత్ర పరిశోధనలు ప్రారంభించడం ద్వారా జవాబుదారీతనం ప్రక్రియను బలోపేతం చేయడం, పరీక్షా విధానాలపై సమగ్ర సమీక్ష నిర్వహించడం మరియు విద్యార్థులతో స్పష్టమైన కమ్యూనికేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా బలమైన సంస్కరణలు, పారదర్శకత మరియు కమ్యూనికేషన్‌ను సిఫార్సు చేయడానికి నిపుణుల సలహా మండలిని ఏర్పాటు చేయడం. పరీక్షల షెడ్యూల్‌లను నవీకరించడం, దర్యాప్తు పురోగతి మరియు ఫలితాలను పంచుకోవడం మరియు నిర్దిష్ట అమలు సమయపాలనతో ప్రతిపాదిత సంస్కరణలను వివరించడం వంటి చర్యలు అవలంబించాలని కోరారు. జాతీయ పరీక్షా సంస్థ (ఎన్.టి.ఏ) పై ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొనాలని, ఔత్సాహిక వైద్య విద్యార్థుల కలలను కాపాడాలని భవిష్యత్తులో రూపొందించే వ్యవస్థ యొక్క సమగ్రతను నిర్ధారించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే నీట్ పరీక్షా విధానంపై సీబీఐ విచారణను ప్రారంభించి సత్వర చర్యలు తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ  ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, గౌరవ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకి, కేంద్ర విద్యా శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖలు రాశారు. సీబీఐ విచారణ పూర్తికాకముందే, కమిటీ తుది నివేదిక లేకుండానే రివైజ్డ్ ఎగ్జామిన్ నిర్వహించి, లీకైన నీట్ ప్రశ్నపత్రం వల్ల ప్రాథమిక లబ్ధిదారులుగా అనుమానిస్తున్న కొద్దిమంది విద్యార్థుల కోసం మాత్రమే ఈ పరీక్షను నిర్వహించడంతోపాటు న్యాయబద్ధత, చిత్తశుద్ధిపై తీవ్ర ప్రశ్న తలెత్తింది. దేశవ్యాప్తంగా తల్లిదండ్రులు, విద్యార్థులలో చాలా ఇబ్బంది, అసంతృప్తిని కలిగించిన ప్రక్రియ. విచారణలో అంతర్లీన కారణాలను గుర్తించి మొత్తం లబ్ధిదారులను గుర్తించాలని కోరుతూ వాస్తవాలు, అసంపూర్ణ దర్యాప్తు ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ప్రభావితమైన ప్రతి విద్యార్థికి మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ చర్య తీసుకోవడం ద్వారా, ప్రవేశ పరీక్షలో తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి సమాన అవకాశం నుండి ఏ దరఖాస్తుదారుడు అన్యాయంగా నష్టపోకుండా చూసుకోవచ్చని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిన్నటి పార్లమెంట్ సమావేశాలలో మాట్లాడుతూ దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని నీట్ ప్రశ్నపత్రాల లీకేజి కి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని తెలియజేసారని తిరుపతి ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు.

Back to Top