వైయ‌స్ జగన్ ఎందుకు రాజీనామా చేస్తారు? 

వైయ‌స్ జగన్ రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారనే వార్తల్లో వాస్తవం లేదు..

మా ప్రభుత్వంలో అవినీతి జరిగితే విచారణ చేస్తుకోండి 

వైయ‌స్ఆర్‌సీపీ ఉత్త‌రాంధ్ర రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

 విశాఖ‌:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారనే వార్తల్లో వాస్తవం లేద‌ని, వైయ‌స్ జగన్ ఎందుకు రాజీనామా చేస్తార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఉత్త‌రాంధ్ర రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
 ప్రశ్నించారు. వైయ‌స్ జగన్ రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారన్న వార్తలు వాస్తవం కాదు..విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంద‌న్నారు.  హామీల అమలుకు పోరాటం చేయాలి.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని సమస్యలపై చర్చించటం మంచి పరిణామమే అని ఆయన తెలిపారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే ప్రత్యేక హోదా రావాలి.. ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది.. రెండు చోట్లా వాళ్ళే ఉన్నారు కాబట్టి హోదా తేవాలి.. రెండు రాష్ట్రాల సమస్యలు ఇద్దరు సీఎంలు మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి.. నిన్న ఉచిత ఇసుక అని ప్రకటించి ఒక్క రోజులోనే బ్రహ్మాండంగా నిర్మాణాలు జరుగుతున్నాయని చెబుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. 
 
మేము ఇసుకలో అక్రమాలు చేశామని దుష్ప్రచారం చేయటం తగదు.. ఉచిత ఇసుక అంటూనే టన్నుకు కొంత మొత్తం వసూలు చేస్తున్నారు.. టీడీఆర్ బాండ్ల విషయంలో మేము అవినీతి చేసినట్లు నిరూపిస్తే నిరభ్యంతరంగా విచారణ చేసుకోవచ్చు.. మా ప్రభుత్వంలో ఎక్కడా అవినీతి జరగలేదు.. అవినీతి చేశామని వాళ్ళు భావిస్తే వాళ్ళ ప్రభుత్వమే అధికారంలో ఉంది.. విచారణ చేసి మా అవినీతి నిరూపించాలి అని వైవీ సుబ్బారెడ్డి సవాల్ చేశారు. 

Back to Top