గ‌వ‌ర్న‌ర్ దృష్టికి వరద బాధితులకు జరిగిన అన్యాయం

గవర్నర్‌ను కలిసిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు..
 

విజయవాడ:  చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో వరద బాధితులకు జరిగిన అన్యాయాన్ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కలిసి వ‌ర‌ద బాధితుల స‌మ‌స్య‌ల‌పై  వినతిపత్రం అందజేశారు. చంద్ర‌బాబుకు మైన్స్‌, వైన్స్‌పై ఉన్న శ్ర‌ద్ధ వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవ‌డంలో లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు విమ‌ర్శించారు. బాధితులు నిత్యం విజ‌య‌వాడ క‌లెక్ట‌రేట్ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని పేర్కొన్నారు. అర్హులంద‌రికీ ప‌రిహారం అందించాల‌ని వారు డిమాండు చేశారు.

గవర్నర్‌ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్,వెస్ట్ నియోజకవర్గ ఇంఛార్జి ,మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు,సెంట్రల్ నియోజకవర్గ ఇంఛార్జి మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా,మేయర్ రాయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లందుర్గ, వైయ‌స్ఆర్‌సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి ఉన్నారు. 
 

Back to Top