అమరావతి: రేపు (బుధవారం) వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టారు. సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా సింగుపురం, జగనన్న లే-ఔట్ లో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు మొక్కలు నాటారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ఎస్‌కే ఉన్నత పాఠశాల మైదానంలో నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టిన రోజు వేడుక పార్టీ నేతలకే కాదని ప్రజలందరికీ పర్వదినం వంటిదని చెప్పారు. అందుకనే మూడురోజుల ముందునుంచే వైయస్ జగన్ పుట్టిన రోజూ వేడుకను రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవాకార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచే విధంగా ఏదో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. అందులో భాగంగానే ఈరోజు మొక్కలు నాటడం, రేపు రక్తదానం, పేదలకు అన్నదానం తదితర కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. పార్వతీపురంలో.. జననేత వైయస్ జగన్ జన్మదినోత్సవం కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ఆశయంగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం వైయస్ జగన్ గారి 50వ జన్మ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారధ్యంలో పార్వతీపురంలో భారీగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, జూనియర్ కళాశాల రోడ్డు ప్రాంగణాలలో భారీ స్థాయిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ నేటితో 50 వసంతాలు పూర్తి చేసుకుని రేపు డిసెంబర్ 21వ తేదీన 51వ వసంతంలో అడుగుపెడుతున్న నవత్నాల ప్రదాత, 6 కోట్ల ఆంధ్రులకు సుపరిపాలనను అందిస్తున్న ఆరాధ్య నాయకులు, నేటి యువతరానికి ఆదర్శ ప్రదాత, కోట్లాది మంది ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న అభిమాన నాయకులు వైయస్ జగన్ అని కొనియాడారు. పుట్టిన రోజు సందర్భంగా సోమవారం నియోజకవర్గ స్థాయి క్రీడలు, రంగవల్లికలు కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రెండవ రోజు భారీ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సహితం నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బోను గౌరేశ్వరి, వైస్ చైర్‌పర్సన్ కొండపల్లి రుక్మిణి, పార్టీ పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, వైస్ చైర్మన్ ఇండుపూరు గున్నేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. జూపాడుబంగ్లాలో.. సీఎం వైయస్ జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ ఆదేశాల మేరకు జూపాడుబంగ్లా ఏపీ మోడల్ స్కూల్‌లో వైయస్ఆర్‌సీపీ నాయకులు, అధికారులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ సువర్ణమ్మ, ఎంపీడీవో మణిమంజరి, ప్రిన్సిపాల్, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో.. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆదేశాల మేరకు సీఎం వైయస్ జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వెలుగోడు పట్టణంలో 5వ సచివాలయంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వెలుగోడు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ వేల్పుల జైపాల్, ఎంపీపీ లాలం రమేష్, పార్టీ మండల అధ్యక్షుడు అంబాల ప్రభాకర్ రెడ్డి , నాయకులు ఎం ఇలియాస్ ఖాన్ , దేశం తిరుపం రెడ్డి, అమీర్ అలీ ఖాన్ , వైస్ ఎంపీపీలు నసీరుద్దీన్, శంకర్ నాయక్, రామ్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, మొహమ్మద్ ఖాన్, షంషీర్ అలీ, ఎంపీటీసీ చాంద్, గోవర్ధన్ రెడ్డి, తెలుగు రమణ, నారాయణ , నాగన్న, రమేష్, ఆరిఫ్, కరిముల, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.