రేపు వైయస్‌ జగన్‌ గుంటూరు పర్యటన 

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి బుధ‌వారం గుంటూరులో ప‌ర్య‌టించ‌నున్నారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో గుంటూరు మిర్చి యార్డ్‌కు చేరుకుని...గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులతో మాట్లాడ‌నున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top