వైయ‌స్ఆర్‌సీపీ  కార్యకర్త కిడ్నాప్‌! 

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి సర్కార్‌ వేధింపులు కొనసాగుతున్నాయి. తాడేపల్లిలో నాగిరెడ్డి (నాని) అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయ్యప్ప దీక్షలో ఉన్న నాగిరెడ్డిని పూజ చేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఒక ప్రైవేట్ కారులో పోలీసులు ఎత్తుకెళ్లారు. తాము వినుకొండ పీఎస్ నుంచి వచ్చామని చెప్పిన పోలీసులు.. ఆ తర్వాత కాదు.. కాదు సత్తెనపల్లి నుంచి వచ్చామంటూ మాటమార్చారు. అసలు వచ్చిన వారు పోలీసులా? టీడీపీ గూండాలా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. నాని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

కాగా, చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో పోలీసుల ద్వారా గూండాగిరీకి బరి తెగించింది. ఫలితంగా ఖాకీ క్రౌర్యం కట్టలు తెంచుకుంటోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజల్ని చైతన్య పరుస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తోంది. విచారణ పేరుతో వేధిస్తోంది. పౌర హక్కులను కాలరాస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. సుప్రీంకోర్టు తీర్పును నిర్భీ­తిగా ఉల్లంఘిస్తూ పోలీసు రాజ్యంతో బెంబేలెత్తిస్తోంది.

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  కొండంత అండ

కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులను ఎదుర్కొంటున్న కార్యకర్తలు, సోషల్‌ మీడియా యాక్టివిస్టులకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  కొండంత అండగా నిలుస్తోంది. వారికి అండగా ఉండేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా సోషల్‌ మీడియా కార్యకర్తలు, యాక్టివిస్ట్‌లపై కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులను దీటుగా ఎదుర్కొని, అన్ని విధాలా వారికి అందుబాటులో ఉండేందుకు పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ‘సెంట్రల్‌ ఆఫీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌’ను ఏర్పాటు చేసినట్లు వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

 

సెంట్రల్‌ ఆఫీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సభ్యుల వివరాలు
జె. సుదర్శన్‌ రెడ్డి , సీనియర్‌ అడ్వొకేట్‌ 
ఫోన్‌ నం: 9440284455 
కొమ్మూరి కనకారావు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్‌ 
మాజీ ఛైర్మన్‌ – ఫోన్‌ నం:  9963425526 
దొడ్డా అంజిరెడ్డి , రాష్ట్ర సోషల్‌ మీడియా వింగ్‌ ఆర్గనైజింగ్‌ ప్రెసిడెంట్‌ – ఫోన్‌ నం: 9912205535 

Back to Top