తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గల్ఫ్ దేశాలకు చెందిన పలువురు ఏపీఎన్‌ఆర్‌టీఎస్ సమన్వయకర్తలు, వైయస్‌ఆర్‌సీపీ కన్వీనర్లు కలిశారు. ఏపీకి చెందిన వలస కార్మికులకు గల్ఫ్ దేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం, వారికి అవసరమైన చర్యలపై సీఎం వైయస్ జగన్ ఆరా తీశారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నట్లు సీఎంకి ఆయా దేశాలకు చెందిన ప్రతినిధులు వివరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం (మైనార్టీ వెల్ఫేర్) ఎస్.బి.అంజాద్ బాషా, ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ ప్రెసిడెంట్ వెంకట్ ఎస్. మేడపాటి, కువైట్ ఏపీఎన్‌ఆర్‌టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్‌లు నాయని మహేష్ రెడ్డి, ఎంవి నరసారెడ్డి, దుబాయ్ కోఆర్డినేటర్ సయ్యద్ నాసర్ వలీ, వైఎస్సార్‌సీపీ గల్ఫ్ కన్వీనర్ బిహెచ్ ఇలియాస్, కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, ఖతార్ కన్వీనర్ డి.శశికిరణ్, దుబాయ్ కన్వీనర్ సయ్యద్ అక్రమ్, సౌదీ అరేబియా కన్వీనర్ రెవెల్ ఆంథోని పాల్గొన్నారు.