ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం వైయ‌స్ జగన్‌ది

నవరత్నాలు అంశంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీర్మానం
 

గుంటూరు: ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం వైయ‌స్ జగన్‌ద‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అన్నారు. నవరత్నాలు అంశంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీర్మానం చేశారు. నవరత్నాలు, గ్రామ సచివాలయాలను స్టడీ చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. పేదలందరికీ వైద్యం అందించే దిశగా సీఎం వైయ‌స్ జగన్‌ కృషి చేస్తున్నార‌ని తెలిపారు. 
అమ్మ ఒడి లబ్ధిదారులకు మూడేళ్లలో రూ. 19,600 కోట్లపైగా నగదు బదిలీ చేశార‌ని చెప్పారు. రాష్ట్రంలో 61 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామ‌న్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పధకాలు అమలవుతున్నాయి.. 31 లక్షలమంది మహిళలకు ఇళ్ల పట్టాలు అందజేశామ‌ని  పెద్దిరెడ్డి వివ‌రించారు.

Back to Top