ప్ర‌తీ గ్రామ స‌చివాల‌యానికీ రూ.20ల‌క్ష‌లు 

 రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు

 భైరి గ్రామంలో గడపగడపకూ మన ప్రభుత్వం

శ్రీ‌కాకుళం:  ప్ర‌తీ గ్రామ స‌చివాల‌యానికి ఇర‌వై ల‌క్ష‌ల రూపాయ‌లు మంజూరు చేస్తున్నామ‌ని, వీటిని వినియోగించుకుని సంబంధిత అభివృద్ధి ప‌నులు త‌క్ష‌ణ  అవ‌స‌రాలను దృష్టిలో ఉంచుకుని చేప‌ట్టాల‌ని రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు వెల్ల‌డించారు. మంత్రి ప్రసాదరావు నేతృత్వాన శ్రీకాకుళం మండలం, భైరి గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయనేమన్నారంటే..

"సరిగ్గా మూడేళ్ల కిందట ఎన్నికలు జరిగినప్పుడు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని మీ అందరికీ విన్నవించాను. మా పార్టీకి ఓటేస్తే ఏయే కార్యక్రమాలు అమలు చేస్తామో అన్నది కూడా మ్యానిఫెస్టో రూపంలో మీ అందరికీ వివరించాను. అలానే మీరు ఓటు వేశారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నన్ను కూడా గెలిపించారు. పాలన పగ్గాలు అందుకుని మూడేళ్లయింది. మూడేళ్ల కాలం అంటే ఓ ప్రభుత్వం పనిచేస్తున్న తీరును అర్థం చేసుకునేందుకు, అంచనా వేసేందుకు సరైన సమయం. ఓ ప్రభుత్వం అధికారంలో ఉండే ఐదేళ్ల కాలానికి గాను మూడేళ్ల కాలం పూర్తవ్వడం అంటే నిజంగానే ఇదొక కీలక సమయం.అందుకే మిమ్మల్ని కలిసేందుకు ఇక్కడికి వచ్చాను. మీకు ఆనాడు చెప్పిన మాటలు అన్నీ అమల్లోకి వచ్చాయా లేదా ఆచరణాయుతం అయ్యాయా అని తెలుసుకునేందుకే ఈ గడపగడపకూ మన  ప్రభుత్వం కార్యక్రమం. అందుకే మీకు అందుతున్న పథకాలు, వాటి తీరుతెన్నులు తెలుసుకున్నాకే నేను ఇచ్చిన మాటలు అన్నీ నిలబెట్టుకున్నాకే మళ్లీ మీ దగ్గరకు ఓటు అడిగేందుకు వస్తాను. ఏ విధంగా చూసుకున్నా మహిళల గౌరవాన్ని పెంచిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం.. ఆ సంగతి మీరు మరిచిపోకూడదు. అదేవిధంగా గ్రామంలో విద్యుత్ సరఫరా కు సంబంధించి సమస్య ఉందని నా దృష్టికి తెచ్చారు. ఇందుకోసం కొత్త లైన్ మంజూరుకు ఎనిమిది లక్షల రూపాయలు తక్షణమే కేటాయించాలని  సంబంధిత అధికారులను ఆదేశించాను" అని చెప్పారాయన. 
 ఆ రోజు డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మాట తప్పారని, వైయ‌స్ జ‌గ‌న్ తన పాదయాత్రలో చెప్పినట్టుగా ఇప్పటికే మూడు దఫాల్లో బ్యాంకులకు చెల్లించి మహిళల గౌరవం పెంచారని అన్నారు.  అదేవిధంగా రైతులకు పెట్టుబడి సాయం కింద 13వేల 500 రూపాయలు అందిస్తున్నాము, ఈ  సాయాన్ని సంబంధిత లబ్ధిదారులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లంచాలు లేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని అన్నారు. పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు, వారు ఆనందంగా జీవించేందుకే పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాం అని చెప్పారు. మీ గ్రామంలో  ఇక్కడి సచివాలయం పరిధిలో సుదీర్ఘ కాలంగా నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా విద్య, వైద్యారోగ్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతూ..ఇప్పటికే 900 పడకలను ప్రభుత్వాస్పత్రిలో అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇదంతా మీరు అధికారంలోకి తెచ్చిన వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వం వల్లే సాధ్యమయిందని అన్నారు.

"వంట గ్యాస్ ధర కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఇక ఇతర నిత్యావసర సరకుల ధరల విషయమై విపక్షం నానా రాద్ధాంతం చేస్తోంది. వాటి విషయమై మీరు పక్క రాష్ట్రాలతో పోల్చి చూడండి.మీకే వాస్తవాలు తెలుస్తాయి అని అన్నారు. ఏదేమయినప్పటికీ దేశ వ్యాప్తంగా ధరలు పెరిగాయి ఒక్క మన రాష్ట్రంలోనే కాదు అన్న విషయాన్ని మీరు గుర్తించాలి" అని విన్నవిస్తున్నాను. అదేవిధంగా వలంటీర్లు తమ వృత్తిని ఛాలెంజ్ గా తీసుకోవాలి, పక్షపాత ధోరణి వీడాలి. 50 కుటుంబాలకు కొడుకుగా ఉంటూ సేవ చేసే అవకాశం కలిపిస్తుంటే కొంతమంది తప్పుదోవ పట్టారు. అటువంటి వారిని విధుల నుంచి తొలగిస్తాము..అని చెప్పారాయన. 

ఐదేళ్ల కాలంలో పేద‌ల‌కూ, బ‌డుగుల‌కూ సాయం అందించాల‌న్న సంక‌ల్పంతోనే ఎన్నిక‌ల హామీలు ఇచ్చారు. వాటిని నిర్వ‌ర్తిస్తున్నారు. హాయిగా ప్ర‌జ‌లు జీవించేందుకు ఉన్న ఆదేశిక సూత్రాల‌న మన ప్రభుత్వం అమలు చేస్తుంది. 30 శాతం మందికి మ‌న రాష్ట్రంలో చ‌దువు లేదు. వారికి విద్యా సంబంధిత సౌక‌ర్యాల లేమి నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ వేధించింది.వాటిని దూరం చేసేందుకు ఈ ప్ర‌భుత్వం కృషి చేస్తోంది. 

ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ఉన్న‌త విద్య చ‌దివేంత వ‌ర‌కూ అన్ని ర‌కాల సౌక‌ర్యాలూ ఇస్తున్నాం. నాణ్య‌మైన మ‌ధ్యాహ్న భోజ‌న
ప‌థ‌కం అందిస్తున్నాం. అదేవిధంగా నాడు నేడు లో భాగంగా పాఠ‌శాల‌ల రూపురేఖ‌లే మార్చేశాం. విద్యా కానుక‌లో భాగంగా 
కాళ్ల‌కు బూట్లు న‌డుముకు బెల్టు, బ్యాగు,  యూనిఫాం, పాఠ్య పుస్త‌కాలు, నోటు పుస్త‌కాల‌తో స‌హా ఇలా అన్నింటినీ అందించాం. 
అంద‌రూ చ‌దువుకోవాలి ఎందుకంటే ఈ రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కు అంద‌రికీ ద‌క్కాలి అని భావిస్తూ ఈ ఐదేళ్ల పాల‌న సాగుతోంది.ప‌థ‌కాల వెనుక ఉద్దేశం, ల‌క్ష్యం అర్థం చేసుకుని రానున్న కాలంలో ఇదే ప్ర‌భుత్వాన్ని ల‌బ్ధిదారులు ఎన్నుకోవాలి. 
లేదంటే అస‌లు ప‌థ‌కాలే వృథా అంటున్న వ్య‌క్తులు గ‌ద్దెనెక్కి ఇప్ప‌టి ల‌క్ష్యాల‌న్నింటినీ నీరుగారుస్తారు. ఓటు కోసమే ఇవ‌న్నీ చేస్తున్నాం అని అనుకోవ‌డం కానీ విప‌క్షాలు ఆ విధంగా ప్ర‌చారం చేయ‌డం కానీ అర్థ ర‌హితం.ముందు ప‌థ‌కాల నెర‌వేర్పు వెనుక ఉన్న అస‌లు ల‌క్ష్యం గ్రామాల్లో ఉన్న కార్య‌క‌ర్త‌లు ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి. అప్పుడు విప‌క్షాల దుష్ప్ర‌చారం ఆగుతుంది అని అన్నారు.
వలంటీర్లు తమ వృత్తిని ఛాలెంజ్ గా తీసుకోవాలి, పక్షపాత ధోరణి వీడాలి. 50 కుటుంబాలకు కొడుకుగా ఉంటూ సేవ చేసే అవకాశం కలిపిస్తుంటే కొంతమంది తప్పుదోవ పట్టారు. అటువంటి వారిని విధుల నుంచి తొలగిస్తాము..." అని హెచ్చ‌రించారు.

యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ, గత ప్రభుత్వానికి వైయ‌స్ఆర్సీపీ ప్రభుత్వం తేడాను వివరించారు.  ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య దళారీ వ్యవస్థ లేకుండా, మధ్యవర్తులు, లంచాలు లేకుండా, 
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలును అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వం అని అన్నారు. అనంత‌రం 11 మంది కి కొత్తగా మంజూరైన పెన్షన్లు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

Back to Top