వెంకటాయపాలెం: పాలకుడంటే పాలించేవాడే కాదు, ప్రజల సంక్షేమాన్ని కోరుతూ వారి కన్నీటిని తుడిచేవాడని కొత్త అర్ధం చెప్పారు. అన్నా నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇద్దరమ్మాయిలు, గత పద్నాలుగేళ్ళుగా అద్దె ఇంటిలో ఉండేదాన్ని, మా జీవితాల్లో మీరు పేదలందరికీ ఇళ్ళు అనే పథకం తీసుకొచ్చి వెలుగులు నింపారు, మేం మీకు రుణపడి ఉంటాం. మాకు పట్టాలు ఇవ్వడం ఆలస్యమైన విషయం మాకు తెలుసు, మీరు మాకు హమీపత్రం ఇచ్చారు ఎందుకు ఆలస్యమైందో చెప్పారు, మిమ్మల్ని దుర్భాషలాడినా మీరు చెదరని చిరునవ్వుతో ముందుకెళ్ళారు, మీరే మా ధైర్యం అన్నా, మీకు పక్కనే ఉన్న వెంకన్న సామి, కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. మాకు పట్టాలు ఇచ్చినప్పుడు చాలా సంతోషం వేసింది, కొద్ది రోజుల్లోనే ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది. మాలాంటి పేదలకు పట్టాలిస్తే ఇది స్లమ్ అవుతుందన్నారు, కానీ నాకు ఇచ్చిన ఇంటి స్ధలం విలువ రూ. పది నుంచి రూ. పదిహేను లక్షలు ఉంటుంది, ఇంతకంటే ఏం కావాలి. మేం అనేక పథకాల ద్వారా లబ్ధిపొందుతున్నాం, నేను మొత్తం రూ. 1,89,250 నగదు రూపంలో, స్ధిరాస్ధి రూపంలో పది నుంచి పదిహేను లక్షలు లబ్ధిపొందాను. మీరే మా ధైర్యం, మీరే మా నమ్మకం అన్నా. మాకు ధైర్యం ఇచ్చారు: స్వప్న, లబ్ధిదారు, రాణిగారితోట, విజయవాడ తూర్పు నియోజకవర్గం అన్నా, నేను ఒక మధ్యతరగతి మహిళను, సొంత ఇల్లు లేక, అద్దెలు కట్టుకోలేక ఇబ్బందులు పడ్డాను, నాకు ఏ ప్రభుత్వంలో ఇల్లు రాలేదు, కానీ మీరు అధికారంలోకి రాగానే వలంటీర్ చెప్పగానే అప్లై చేశాను, నాకు మంజూరైంది, అన్నా మీ సహనానికి హ్యట్సాఫ్, మా పేదల తరపున మీరు నిలబడి చేసిన న్యాయపోరాటానికి మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. మా పేదల కలను సుసాధ్యం చేసిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను వైఎస్సార్ ఆసరా ద్వారా లబ్ధి పొందాను, నా కొడుకు ఈ రోజు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడంటే మీరే కారణం, అన్నా నేను నాలుగేళ్ళుగా వలంటీర్ గా సేవలు అందిస్తున్నాను, నా క్లస్టర్ పరిధిలో 60 కుటుంబాలు ఉన్నాయి, ఈ మధ్యకాలంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాపై బురదచల్లే ప్రయత్నం చేశారు, వారి రాజకీయ ప్రయోజనాల కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు, మా గురించి దారుణంగా మాట్లాడినా మీరు మా పక్కన నిలుచుని మాకు ధైర్యం ఇచ్చారు, థ్యాంక్యూ అన్నా. జోగి రమేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి పెత్తందార్ల కోటలను బద్దలు కొట్టి, పేదల పక్షాన నిలిచి, సుప్రింకోర్టు దాకా వెళ్ళి వారిని గెలిపించి చరిత్రను తిరగరాస్తున్న జగనన్నకు అందరం జేజేలు చెబుదాం, రాజధానిలో ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు నివసించాలంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టు కెళ్ళాడు చంద్రబాబు నాయుడు. బాబూ సామాజిక సమతుల్యత అంటే ఏంటి, పెత్తందార్ల పక్కన మన ఇళ్ళు ఉండటం ఘోరమా, ప్రతిపక్షం పేదల పక్షాన ఉండాలి కానీ పేదలకు ఇళ్ళ స్ధలాలు వద్దు అని కోర్టుకెళ్ళిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మన జగనన్న మన పక్షాన నిలిచి పోరాడారు, ఎన్నికల సీజన్ మొదలవగానే రోడ్ల మీదకొచ్చి కొందరు మాట్లాడుతున్నారు. నారా చంద్రబాబు మా పేదలను పీక్కు తిన్నాడు, పవన్ కళ్యాణ్ ఎన్ని పార్టీలను మార్చావు, బీఎస్పీ, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, ఇలా ఎన్ని, పార్టీలు మార్చడం, పెళ్ళాలను మార్చడం వెన్నతో పెట్టిన విద్య, పవన్ ఏ పార్టీని ఏ పార్టీతో కలపాలి అని నువ్వు విగ్గురాజు కలిసి కంపెనీ పెట్టుకోండి. మా జగనన్న కోట్ల మందికి అన్నం పెడుతున్నారు, ఆయన్ను ఓడిస్తారా, ఎంతమంది వచ్చినా మా అన్నను టచ్ కూడా చేయలేరు. ఇంకొకడు జగనన్నతో పోటీ అంటూ నడుస్తున్నాడు, నువ్వెంత నీ స్ధాయి ఎంత, మన పేదలంతా జగనన్న అడుగులో అడుగు వేయాలి, థ్యాంక్యూ.