తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ న్యాయం వైపే ఉంటారని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ఏ రోజైనా చట్టం తన పని తాను చేసుకోనిచ్చారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అనంత్‌బాబు కేసు విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించామని తెలిపారు. మంగళవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. వనజాక్షి ఘటనను ఎవరూ మరచిపోలేదన్నారు. ఆ రోజు ఎమ్మార్వోపై దాడి జరిగితే చంద్రబాబు ఏం చేశారో అందరికీ తెలుసు అన్నారు. ఎమ్మెల్సీ కేసు విషయంలో ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు ఏ రోజైనా చట్టం తన పని తాను చేసుకోనిచ్చారా?. ఎమ్మెల్సీ అనంత్‌బాబు కేసు విషయంలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించిందన్నారు. సీఎం వైయస్ జగన్ ఎప్పుడూ న్యాయం వైపే నిలిచారని గుర్తు చేశారు. చట్టం ముందు ఎవరైనా ఒకటే అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలపైన వార్తలు కూడా వచ్చేవి కావన్నారు. ఇప్పుడు ఏ ఘటన జరిగినా ఎల్లోమీడియా విష ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. అరెస్టు చేసే క్రమంలో పోలీసులు తమ రూల్స్ ఫాలో అయ్యారని తెలిపారు.