తాడేపల్లి: అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబును నమ్మేదెవరని ఏపీ ప్రభుత్వ సామాజికన్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ రావు ప్రశ్నించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైయస్ జగన్ నాయకత్వంలో దూసుకువెళ్తోంది. ఆయన్ను ఎదుర్కోలేక ప్రతిపక్షాలన్నీ కుట్ర పూరితంగా ఒకటవుతున్న విధానం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సిద్ధం అనే శబ్దాన్ని రణనినాదంగా మార్చి లక్షల మంది ప్రజలతో రాష్ట్రంలో వైయస్ జగన్ పెడుతున్న సభలకు వస్తున్న ప్రజలే మా సుపరిపాలనకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ సామాజికన్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ రావు బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జూపూడి ప్రభాకర్ రావు ఇంకా ఏమన్నారంటే.. మళ్ళీ లక్షల కోట్ల సంక్షేమాన్ని అందించేందుకు మేం సిద్ధం: – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి నాయకత్వంలో దూసుకువెళ్తోంది. ఆయన్ను ఎదుర్కోలేక ప్రతిపక్షాలన్నీ కుట్ర పూరితంగా ఒకటవుతున్న విధానం ప్రజలు గమనిస్తున్నారు. – సిద్ధం అనే శబ్దాన్ని రణనినాదంగా మార్చి లక్షల మంది ప్రజలతో రాష్ట్రంలో వైయస్ జగన్ గారు పెడుతున్న సభలకు వస్తున్న ప్రజలే మా సుపరిపాలనకు నిదర్శనం. – వైయస్ జగన్ సిద్ధం అని ఎందుకు అంటున్నారో దాన్ని ప్రతిపక్షాలు గ్రహించడం లేదు. – వారి జీవిత కాలంలో వైయస్ జగన్ చేసిన పనులు చేయలేక, ఆయన్ను వ్యతిరేకించడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. – మేము సిద్ధం అంటే..వారు మేము కూడా సిద్ధమే..సంసిద్ధమే అంటూ బలహీనమైన గొంతుతో బేలగా మాట్లాడుతున్నారు. – ఈ రాష్ట్రంలో తిరిగి డీబీటీ ద్వారా లక్షల కోట్లు ప్రజలకు పంచడానికి మేం సిద్ధం. – జగన్ గారిని గెలిపిస్తే సంక్షేమ కార్యక్రమాలు మీ ఇంటి తలుపు తట్టి వస్తాయి. దానికి మేం సిద్ధం. – ప్రభుత్వ తెలుగు మీడియం స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం తీసుకురావడం, వైద్య రంగంలో విప్లవాత్మకమైన ఎన్నో మార్పులు తెచ్చాం. 55 వేల మంది సిబ్బందిని నియమించాం. ప్రతి పల్లెకు వైద్యం అందించేందుకు మేం సిద్ధం. – మహిళల ఆత్మగౌరవాన్ని పెంచడం కోసం వైయస్ఆర్‌సీపీ సిద్ధం. – పేదరిక నిర్మూలన కోసం మేం సిద్ధం...ఆర్బీకే సెంటర్ల ద్వారా వైయస్ఆర్ ఆలోచనా విధానాలను అమలు చేయడంలో మేం సిద్ధం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు అండ్ కో.. ను నమ్మేవాడెవడు..?: – ఏం చేశారని తెలుగు దేశం పార్టీ సంసిద్ధం అంటుందో చెప్పాలి? – గతంలో మీరు చేసిన మంచిని ఒక్కటంటే ఒక్కటి చూపించండి? – ఏనాడైనా మీరు పేద ప్రజలను పట్టించుకున్నారా? గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, వ్యవసాయాన్ని ఏనాడైనా పట్టించుకున్నారా? – అసలు ఈ రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మేవాడెవడు..? – నేడు రాష్ట్రంలో ఒక నూతన విప్లవానికి శ్రీకారం చుట్టి...తిరిగి దాన్ని కొనసాగించడానికి వైయస్ జగన్ సిద్ధం అంటున్నారు. – తన 45 ఏళ్ల అనుభవంలో చంద్రబాబు ఇలాంటి పరిపాలన ఒక్కటన్నా చూపించగలడా? – చంద్రబాబు గారి వయసు 75 అయితే..జగన్ గారి వయసు 50 మాత్రమే. – మీరు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే...వైయస్ జగన్ కు కోవిడ్ కాలం పోను రెండు-మూడేళ్లు మాత్రమే సుపరిపాలన అందించే అవకాశం కలిగింది. ఈ కాలంలోనే రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని సంక్షేమం- అభివృద్ధిని అందించారు. – వైయస్ జగన్ చేస్తున్న సంక్షేమాన్ని తట్టుకోలేక కులాలు, మతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొడుతున్నారు. – నేడు గ్రామస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలవుతోంది. – మీ హయాంలో మీ ఆరోగ్యం, మీ కుటుంబ ఆరోగ్యంపై తప్ప సమాజం ఆరోగ్యం గురించి ఆలోచించారా? – అట్టడుగు వర్గాలకు ఇళ్లుకావాలి, ఆరోగ్యం కావాలి..కూడు, బట్ట కావాలని ఏ రోజైనా మీరు ఆలోచించారా? – నేడు జగన్ గారు అట్టడుగు వర్గాల కోసం పని చేస్తుంటే.. ఏ రోజైనా జగన్ గారు మంచి చేస్తున్నారు అని మాట్లాడారా? ఈ ప్రభుత్వాన్ని ఆపాలనే మీ కలలు...పగటి కలలే: – అంబేద్కర్ ఆశయాలను జగన్ గారు ముందుకు తీసుకెళుతుంటే..మీ పెయిడ్ వర్కర్స్‌తో విమర్శలు చేస్తున్నారు. – ఈ ప్రభుత్వాన్ని ఆపాలని మీరు కనే వెర్రి కలలు నెరవేరవు. – వైయస్ జగన్ ఏ ప్రాంతానికి, ఏ వర్గానికి ఏం చేయాలో అది చేస్తున్నారు. – మీరు వెళ్లి సామాన్యుడితో కలిసి మంచంపైన కూర్చోగలవా చంద్రబాబూ..? ఇక దేనికి మీరు సంసిద్ధం..? – శ్రీశ్రీ జగన్నాథ రథచక్రాలను భూమార్గం పట్టిస్తానన్నట్లు వైయస్ జగన్ పేదల చెంతకు పాలన తీసుకువచ్చారు. – అంబేద్కర్ విగ్రహాంపై సోషల్ మీడియాలో మాలాంటి వారి మాటలను వక్రీకరిస్తున్న పచ్చమీడియాకు బుద్ధుందా? – మీరు అవహేళన చేసినంత మాత్రాన మా మనసులు మారతాయా? ఒక ఎస్సీకి రాజ్యసభ సీటు ఇచ్చావా బాబూ? – ఈ సమాజం బాగుపడాలని, అంతరాలను చెరిపేయాలని జగన్ గారు చేస్తున్న సామాజిక న్యాయాన్ని చూడండి. – అగ్రవర్ణాలను కాదని బీసీలను, ఎస్సీలను పార్లమెంటులో కూర్చోబెట్టిన ఘనత వైయస్ జగన్ గారిది. – ఒక ఎస్సీ గొల్ల బాబూరావును మా నాయకుడు పెద్దల సభలో కూర్చోబెట్టారు. – ఏ రోజైనా ఒక ఎస్సీకి చంద్రబాబు రాజ్యసభ సీటు ఇచ్చాడా? వర్ల రామయ్య గారి ఆవేదన అందరూ చూశారు కదా? – అందుకే వైయస్ జగన్ మళ్లీ రావాలని మేమంతా కోరుకుంటున్నాం. – మా బిడ్డల చదువుల కోసం, వారి ఆకలి తీర్చేందుకు మాకు జగన్ గారి పరిపాలన కావాలని మేం ఆయన్ను గెలిపించేందుకు సిద్ధం. – చంద్రబాబు పొరపాటున వస్తే ఇవన్నీ మింగేసి తన వర్గానికి, కులానికి ఇచ్చుకునే చెత్త ఆలోచనకు పుల్‌స్టాప్ పెట్టడానికి సిద్ధం. – మీరు సంసిద్ధం అనడానికి మీకేమైనా చెప్పుకునేందుకు ఒక మార్క్ ఏమైనా ఉందా? ఈ రాష్ట్రంలో అసలు మీ పాత్ర ఎంత..?: –చంద్రబాబు తోకపట్టుకుని తిరుగుతున్న పవన్ కల్యాణ్ అతని చరిత్ర ఏంటో తెలుసుకో ముందుగా. – ఈ రాష్ట్రంలో అసలు మీ పాత్ర ఎంత? వీరిద్దరినీ నడిపిస్తున్న బీజేపీ పాత్ర ఎంత? – వైయస్ జగన్‌ని ఓడించడం కోసం నేనే ముఖ్యమంత్రి అంటూ పవన్ కల్యాణ్ చెప్తున్నారు. – ఏపీలో టీడీపీ 80 సీట్లలో మాత్రమే పోటీ చేయాలని అమిత్‌షా చెప్తుంటే తట్టుకోలేక, గుక్కపట్టి ఏడుస్తున్న నువ్వెలా సంసిద్ధం అవుతావ్ చంద్రబాబూ..? – ఈ యుద్ధానికి ఇంతవరకూ దరిదాపుల్లోకి కూడా రాని మీరు ఏ రకంగా సిద్ధం..? – వైయస్ జగన్ మా నాయకుడుగా ఉండటాన్ని మేం గర్వంగా ఫీల్ అవుతున్నాం. – జగనన్న ఆలోచన విధానం వర్ధిల్లాలని మేం కోరుకుంటున్నారు. బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానమే జగనన్న ఆలోచనా విధానం. – మీరు అంబేద్కర్ పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా కోల్పోయారు. – దళితుల్లో ఎవరు పుట్టాలనుకుంటారు అన్నప్పుడు ఎక్కడికి వెళ్లార్రా మీరంతా? – అంబేద్కర్ ఆలోచనా విధానంతో నడుస్తున్న జగనన్న ప్రభుత్వం వర్ధిల్లాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారు. భువనేశ్వరి వెన్నుపోటా..!: – భువనేశ్వరి గారు కుప్పం నుంచి పోటీకి దిగితే చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటాడా? – అలాగైతే అసెంబ్లీలో ఏదో జరిగిందని వెక్కి వెక్కి ఏడ్చి..సీఎం అయితేనే సభకు వస్తానన్న శపథం ఏమవుతుందో చూసుకో. – నువ్వు పలాయనం చిత్తగించే ముందు ప్రజలకు సమాధానం చెప్పి వెళ్లు. – అసలు ఆవిడ కుప్పం నుంచి వాళ్ల ఆయన్ను ఎందుకు మారుస్తుందో చూడాలి. – ఇదేమన్నా భువనేశ్వరి గారి వెన్నుపోటా? మా నాన్నకు వెన్నుపోటు పొడిస్తే.. నీకు పొడవమా అని పొడుస్తోందా? – లోకేశ్, భువనేశ్వరిలు ఏమైనా కుట్ర పన్నారా? ఇవన్నీ మాకు అనవసరం. – పవన్ కళ్యాణ్ జొరబడ్డ తర్వాత టీడీపీలోని సీనియర్ నాయకులు ఎటు వెళ్తున్నారో మాకు అనవసరం. – అమిత్‌షా దెబ్బకు నోరు మెదపకుండా తిరుగుతున్న చంద్రబాబు టీడీపీ క్యాడర్, ఆశావహులకు సమాధానం చెప్పాలి. – ఇన్నేళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీని తుంగలో తొక్కేస్తున్నావా చంద్రబాబూ? – నీ పార్టీని ముంచేయడానికి సంసిద్ధమవుతున్నావా? – గుర్తుంచుకో చంద్రబాబు..ఆ రోజు వస్తుంది..ప్రజలు మళ్లీ మళ్లీ వైయస్ జగన్ నే ఎన్నుకుంటారని జూపూడి ప్రభాకర్ రావు ఉద్ఘాటించారు.