గుండెపోటుతో సోష‌ల్ మీడియా జిల్లా అధ్య‌క్షుడు విఠ‌ల్ మృతి

అనంత‌పురం: ఉమ్మడి అనంతపురం జిల్లా వైయస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ సాయి విఠల్ గుండె పోటుతో మరణించారు. ప్రవీణ్ సాయి విఠల్ మృతి పట్ల అనంతపురం వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ప్రవీణ్ సాయి విఠల్ భౌతికకాయాన్ని సందర్శించి.. నివాళులు అర్పించిన అనంత వెంకటరామిరెడ్డి.. కుటుంబ సభ్యుల్ని పరామర్శించి.. పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Back to Top