తాడేపల్లి: నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో వైయస్ జగన్‌కు టీటీడీ అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలను, టీటీడీ క్యాలెండర్, డైరీలను అందించారు. అలాగే నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వేద పండితులు సీఎం వైయస్.జగన్‌ను వేద మంత్రోచ్ఛారణతో ఆశీర్వదించి, ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.