భారత మహిళల అండర్-19 జట్టుకు వైయ‌స్ జగన్ అభినందనలు 

తాడేపల్లి : టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాపై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత మహిళల అండర్‌-19 జట్టును మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు.
విజయపరంపరను కొనసాగించాలని ఆయ‌న ఆకాంక్షించారు.

మ‌హిళ‌ల అండర్ 19 టీ20 ప్రపంచ క‌ప్‌-2025 విజేత‌గా భార‌త్ నిలిచింది. కౌలాలంపూర్ వేదికగా జ‌రిగిన ఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భార‌త అమ్మాయిలు.. వ‌రుస‌గా రెండో సారి అండ‌ర్-19 ప్ర‌పంచ‌క‌ప్ టైటిల్‌ను గెలుచుకున్నారు.

Back to Top