

















అనంతపురం జిల్లాకు చేరుకున్న సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి
పుట్టపర్తి విమానాశ్రయంలో ఘన స్వాగతం
అనంతపురం: ప్రజారోగ్య రంగంలో మరో విప్లవాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కంటి సమస్యలను దూరం చేయడానికి ‘వైయస్‌ఆర్ కంటి వెలుగు’ పేరుతో బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకాన్ని మరో కొద్దిసేపట్లో అనంతపురం జిల్లాలో సీఎం వైయస్ జగన్ ప్రారంభించనున్నారు. ఇప్పుడే సీఎం వైయస్ జగన్ అనంతపురం జిల్లాకు చేరుకున్నారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఉచితంగా కంటి పరీక్షలు
‘కంటి వెలుగు’ కింద రాష్ట్రంలో 5.40 కోట్ల మందికి నేత్ర పరీక్షలతోపాటు అవసరమైన చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. వైయస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైద్యం, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన తనకు అత్యంత ప్రాధాన్య రంగాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అధికారులతో సమీక్షల సందర్భంగా ఈ రంగాల్లో చేపట్టాల్సిన ముఖ్యమైన అంశాలపైన కూడా సీఎం దృష్టి సారించారు.