తిరుపతి: ఎవరెస్ట్ శిఖరంపై వైయస్ఆర్‌సీపీజెండా రెపరెపలాడింది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో 5,364 మీటర్ల ఎత్తులో వైయస్ఆర్‌సీపీ జెండాను ఆదివారం పార్టీ తిరుపతి ఇన్‌చార్జ్ భూమన అభినయ్ ఎగురవేశారు. తన మిత్ర బృందంతో కలిసి ఆయన సాహసయాత్ర చేశారు. ఈ సందర్భంగా భూమన అభినయ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోయి వైయస్ఆర్‌సీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో, పార్టీ యువ నాయకుడిగా అత్యున్నత శిఖరంపైకి సాహసయాత్ర చేసి, పతాకాన్ని ఎగుర వేయడం ఆనందంగా వుందన్నారు. రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్‌లోవైయస్ఆర్‌సీపీ జెండా తప్పకుండా రెపరెపలాడుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తాను, తన టీమ్ ఎలాగైతే ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యంత సాహసంతో అధిరోహించి జెండాను ఎగురవేసినట్టుగా, కష్టాలను ప్రతి కార్యకర్త, నాయకుడు అధిగమించి గర్వంగా జెండాను రెపరెపలాడిస్తారని అన్నారు. ఇదే సందర్భంలో అత్యున్నత శిఖరమైన ఎవరెస్ట్‌పై ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి చిత్రపటాన్ని భూమన అభినయ్ టీమ్ ఆవిష్కరించింది. తిరుపతి నగరం దినదినాభివృద్ధి సాధించాలని అభినయ్ ఆకాంక్షించారు.