విద్యుత్ ఛార్జీల పెంపుపై గళమెత్తిన వైయస్‌ఆర్‌సీపీ 

ఎన్టీఆర్ జిల్లా: విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చిల్లకల్లు సబ్ స్టేషన్లు వద్ద వైయస్‌ఆర్‌సీపీ నేతలు ధర్నా నిర్వ‌హించారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో పేద ప్రజలపై ఆరు నెలల్లో రూ.15,485.36 కోట్ల భారం మోపిన నారా చంద్రబాబు నాయుడు తీరును త‌న్నీరు నాగేశ్వ‌ర‌రావు ఎండ‌గ‌ట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి.. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు.
 

Back to Top