కర్నూలు: కర్నూలు నుంచి అమరావతికి లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌ను తరలించరాదని వైయస్ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కర్నూలు కలెక్టర్ రంజిత్ భాషకు వినతి పత్రం అందజేశారు వైయస్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మేయర్ బీవై రామయ్య, న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే కర్నూలు జిల్లా చాలా నష్టపోయింది. కర్నూలుకు వైఎస్ జగన్ తీసుకువచ్చిన సంస్థలను చంద్రబాబు తరలిస్తున్నారు. కేంద్రాన్ని ఒప్పించి వైయస్ జగన్ కర్నూలుకు లా వర్సిటీని తెచ్చారు. సీమకు చంద్రబాబు చేస్తున్న అన్యాయంపై ఆందోళన చేస్తాం. అధికారంలోకి వచ్చిన ప్రతీసారి చంద్రబాబు.. కర్నూలుకు నష్టం చేస్తున్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా కర్నూలు జిల్లాను కాపాడుకుంటాం. చంద్రబాబు లా యూనివర్సిటీని తరలించుకుపోతుంటే కూటమి ప్రభుత్వంలోని జిల్లా నేతలు ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. ఎస్.వి.మోహన్ రెడ్డి, కర్నూలు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కర్నూలులోని హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టు ఇలా ఇవన్నీ వైయస్ జగన్ ప్రభుత్వంలో కర్నూలులో ఏర్పాటు చేశారు, నేషనల్ లా యూనివర్శిటీకి ఫౌండేషన్ వేశారు, కానీ ఇవన్నీ అమరావతికి తరలిస్తున్నట్లు టీడీపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది, ఇది చాలా దుర్మార్గం రాయలసీమ ప్రాంతం వెనకబడి ఉంది, ఈ చర్య వల్ల మరింత వెనకబడుతుంది, దీనిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, మేం కలెక్టర్‌ను కలిసి దీనిని వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానం అందజేశాం ప్రభుత్వం వెనక్కితగ్గకపోతే న్యాయపరంగా, ప్రజా ఉద్యమాల ద్వారా ఎంత దూరమైనా వెళతాం, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకుని పోతాం శ్రీబాగ్ ఒడంబడికకు విరుద్దంగా ముందుకెళితే కూటమి పార్టీలు ద్రోహుల పార్టీలుగా మిగిలిపోతాయి, కూటమి నాయకులకు చెబుతున్నాం, రాయలసీమ ప్రజల పక్షాన పోరాటం చేయాలి, లేదా ప్రజా ద్రోహులుగా మిగిలిపోతారు కాటసాని రామ్‌భూపాల్ రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు కర్నూలు నుంచి న్యాయసంస్ధలు అమరావతికి తరలించే ప్రయత్నాన్ని విరమించుకోవాలి, రాయలసీమకు అన్యాయం జరిగింది వైయస్ జగన్ కర్నూలుకు జ్యూడిషియల్ క్యాపిటల్ ప్రకటించారు, కర్నూలు ప్రాంత ప్రజలు ఆలోచించాలి, నేషనల్ లా యూనివర్శిటీకి అత్యంత విలువైన భూములు ఇచ్చారు ఇక్కడి ప్రజలు, వీటిని ఇక్కడి నుంచి తరలిపోకుండా మేమంతా పోరాడతాం ప్రజా ఉద్యమాలు చేస్తాం, రాయలసీమ కూటమి నాయకులు ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు, మీలో చిత్తశుద్ది ఉంటే ఈ తరలింపును అడ్డుకోండి న్యాయ సంస్ధలను ఎట్టి పరిస్ధితుల్లో ఇక్కడి నుంచి తరలించడానికి వీల్లేదు బీ.వై.రామయ్య, కర్నూలు మేయర్ 1953 నుంచి కర్నూలు నష్టపోయింది, శ్రీబాగ్ ఒడంబడికకు విరుద్దంగా కర్నూలుకు అన్యాయం చేస్తున్నారు చంద్రబాబుకు రాయలసీమ అంటే ఎందుకంత ద్వేషం, నేషనల్ లా యూనివర్శిటీతో పాటు 43 రకాల కోర్టులు కర్నూలుకు రావాల్సి ఉంది, కానీ చంద్రబాబు వీటిని అడ్డుకున్నారు రాయలసీమ ప్రాంత కూటమి నేతలకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా భావిస్తున్నారు, రాయలసీమ అభివృద్ది కాకుండా చంద్రబాబుకు లొంగిపోయారు మేం అందరినీ కలుపుకుని ముందుకెళతాం, న్యాయసంస్ధల తరలింపును అడ్డుకుంటాం